YSR Kapu Nestham : కాసేపట్లో వైఎస్సార్ కాపు నేస్తం నిధులను విడుదల చేయనున్న జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ కాపునేస్తం ద్వారా ఆర్ధిక సాయాన్ని నేడు అందజేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శనివారం నిడదవోలులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. రాష్ట్రంలో అర్హులైన మొత్తం 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు వున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున అందజేస్తోంది. మొత్తంగా ఐదేళ్లకు రూ.75 వేలు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.2,029 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించినట్లు .
ఈ పథకానికి ఎవరు అర్హులంటే :
ఈ పథకం వర్తించాలంటే కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేల లోపు వుండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12 వేలు వుండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12 వేలు వుండాలి. అలాగే ఆ కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి రెండూ కలిపి 10 ఎకరాలకు మించకూడదు. నగర, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు వున్నవారు అర్హులు. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ ఈ పథకానికి అర్హులే. వైఎస్సార్ కాపునేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఆథార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, వయసు నిర్ధారణ పత్రాలను ప్రభుత్వానికి అందజేయాల్సి వుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com