YSR Kapu Nestham : కాసేపట్లో వైఎస్సార్ కాపు నేస్తం నిధులను విడుదల చేయనున్న జగన్

  • IndiaGlitz, [Saturday,September 16 2023]

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ కాపునేస్తం ద్వారా ఆర్ధిక సాయాన్ని నేడు అందజేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శనివారం నిడదవోలులో జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. రాష్ట్రంలో అర్హులైన మొత్తం 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు వున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున అందజేస్తోంది. మొత్తంగా ఐదేళ్లకు రూ.75 వేలు ఆర్ధిక సాయాన్ని అందజేస్తున్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.2,029 కోట్ల ఆర్ధిక సాయాన్ని అందించినట్లు .

ఈ పథకానికి ఎవరు అర్హులంటే :

ఈ పథకం వర్తించాలంటే కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేల లోపు వుండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12 వేలు వుండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12 వేలు వుండాలి. అలాగే ఆ కుటుంబానికి గరిష్టంగా మూడు ఎకరాల మాగాణి లేదా పది ఎకరాల మెట్ట భూమి లేదా మాగాణి రెండూ కలిపి 10 ఎకరాలకు మించకూడదు. నగర, పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులు, అంతకన్నా తక్కువ విస్తీర్ణంలో ఇల్లు వున్నవారు అర్హులు. కుటుంబంలో ఎవరైనా వృద్ధాప్య, వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ ఈ పథకానికి అర్హులే. వైఎస్సార్ కాపునేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునేవారు ఆథార్ కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, వయసు నిర్ధారణ పత్రాలను ప్రభుత్వానికి అందజేయాల్సి వుంటుంది.

More News

Bigg Boss 7 Telugu : అంతా ఫేక్‌ మనుషులే.. నేనుండలేను, గౌతమ్‌తో ప్రిన్స్ గొడవ.. సందీప్‌పై శివాజీ ఆరోపణలు

పవర్ అస్త్ర, మాయా అస్త్రతో ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టేందుకు బిగ్‌బాస్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు.

Navdeep : డ్రగ్స్ కేసులో నవదీప్‌కు బిగ్‌రిలీఫ్ .. అరెస్ట్‌ చేయొద్దు, పోలీసులకు హైకోర్ట్ ఆదేశాలు

మాదాపూర్ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను మరోసారి ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఓ సినీ నిర్మాత వుండగా..

Chandrababu Naidu:స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదాపడింది.

AP CM YS Jagan:ఆరోగ్యాంధ్రప్రదేశే జగన్ లక్ష్యం.. ఏపీ వైద్య రంగంలో కీలక మైలురాయి, ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌లు ఓపెనింగ్

ఒక రాష్ట్రం అద్భుతంగా పురోగతి సాధించడానికి విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం.

Bigg Boss 7 Telugu : హౌస్‌మేట్స్‌ను బఫూన్స్ అన్న రతిక.. కంటతడిపెట్టిన అమర్‌దీప్

బిగ్‌బాస్ హౌస్‌లో అస్త్రాల కోసం వేట మొదలైన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇచ్చిన టాస్కులు,