Yatra 2:'యాత్ర-2' కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న వైఎస్సార్ అభిమానులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం వైయస్ జగన్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా యాత్ర-2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో వైఎస్సార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమ అధినేతకు సంబంధించిన సంఘటనలను వెండితెరపై చూసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది.
ట్రెండింగ్‌లో మూవీ డైలాగులు..
"జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్" అంటూ కాంగ్రెస్ నేత పాత్రధారి శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్ జగన్ వ్యక్తిత్వాన్ని మరో రేంజికి తీసుకెళ్లింది. అలాగే "ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను" అంటూ జగన్ పాత్రధారి జీవా చెప్పే డైలాగ్స్ సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతున్నాయి.
వైయస్ జగన్ పాదయాత్ర ఆధారంగా..
మరోవైపు ఈ సినిమా ప్రమోషన్లలో మూవీ యూనిట్ స్పీడ్ పెంచింది. దర్శకుడు మహి వీ రాఘవ్, హీరో జీవా, హీరోయిన్ కేతకి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. యాత్ర2లో కేవలం వైయస్ జగన్ చేసిన పాదయాత్రనే మెయిన్ థీమ్‌గా ఉంటుందని, ఇతర పాత్రలకు ఎక్కువగా చూపించలేదని దర్శకులు క్లారిటీ ఇచ్చారు. మూవీలో ఎవ్వరినీ కించపర్చేలా పాత్రలను డిజైన్ చేయలేదని స్పష్టంచేశారు. బురద జల్లే వాళ్లు జల్లుతారు.. రాళ్లు విసిరే వాళ్లు రాళ్లు విసురుతారు.. బురద తుడుచుకుని, రాళ్లు ఏరుకునే ఓపిక తనకి లేదన్నారు.
తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే కొడుకు కథ..
సినిమా ఏంటన్నది ప్రేక్షకులు చూసి డిసైడ్ చేస్తారని తెలిపారు. ఈ చిత్రంలోనూ సీన్లు కల్పితం అని చెప్పలేం.. నిజాలే అని చెప్పలేం.. ఎమోషన్, సోల్‌ను బేస్ చేసుకుని సీన్లు రాసుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. వైఎస్సార్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.. ఎంతో మందికి సాయం చేశారు.. అనే పాయింట్, ఎమోషనల్‌గా చెప్పేందుకే మూగమ్మాయి సీన్ పెట్టానని వెల్లడించారు. తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కొడుకు కథ అని, ఇందులో ఎవరినీ తక్కువ చేసి చూపించలేదని మరోసారి స్పష్టం చేశారు.
వైయస్ జగన్‌లా కనిపించేందుకు కసరత్తు..
ఇక హీరో జీవా మాట్లాడుతూ ఏపీ సీఎం వైయస్ జగన్‌లా కనిపించేందుకు, నటించేందుకు యూట్యూబ్‌లో వీడియోలను ఎక్కువగా చూశానని తెలిపారు. జగన్‌లా కనిపిస్తున్నానా? లేదా? అని అనుకునేవాడినని.. ఆయనలా కనపడేందుకు తీవ్రంగా శ్రమించానని వివరించారు. మొత్తానికి మంచి భజ్ క్రియేట్ చేసిన యాత్ర-2ను చూసేందుకు అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments