వైఎస్ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు!
- IndiaGlitz, [Friday,March 29 2019]
రాబోయే ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయస్ విజయమ్మ ప్రసంగించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అన్యాయాలు, అక్రమాలు చూశామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చదువులన్నీ కూడా ఉచితంగా చదివిస్తారని, ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు కట్టిస్తారన్నారు. మద్యాన్ని మూడు దఫాల్లో నిషేదిస్తారని విజయమ్మ వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల కోసం వైసీపీ పుట్టిందని ఆమె తెలిపారు. వైఎస్ జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
ఓటు అడిగే హక్కు బాబుకు ఉందా..?
విలువలకు,విశ్వసనీయతకు పట్టంకట్టాలి. ఒకసారి వైయస్ రాజశేఖర్‌రెడ్డి పాలనను గుర్తుకుతెచ్చుకోవాలి. ఇది చేశాను అని చెప్పగలిగే సత్తా, సమర్థత చంద్రబాబుకు ఉందా..? ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు ఉందా..? రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు కోసం పుట్టిన పార్టీ వైయస్‌ఆర్‌సీపీ. ప్రజల సంక్షేమం కోసం పుట్టిన వైయస్‌ఆర్‌సీపీ.మీకు,మాకు ఉన్న సంబంధం 40 సంవత్సరాల అనుబంధం.30 సంవత్సరాలుగా మీ భుస్కందాలపై మోసి సీఎంగా చేసుకున్నారు.ఆయన కూడా ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకున్నారు.వైయస్ జగన్ మాట కోసం ఓదార్పు యాత్ర చేశారు.వైయస్ కుటుంబం ప్రజల పట్ల కృతజ్ఞత కలిగివుంటుంది.మీ రుణం తీర్చుకోలేదు. మా బిడ్డలను రక్షణకవచంలా కాపాడుకున్నారు అని విజయమ్మ చెప్పుకొచ్చారు.
నాడు అలా.. నేడు ఇలా..!
తొమ్మిది సంవత్సరాల క్రితం వైయస్‌ఆర్ మరణం తర్వాత మా కుటుంబం ఎదుర్కొన కష్టాల కంటే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు.వైయస్ జగన్ ప్రజల కోసం మొండిగా పోరాడుతున్నారు. ఓదార్పుయాత్రలో మీరు చూపిన ఆదరణ కాంగ్రెస్‌పార్టీ భరించలేకపోయింది. జగన్‌ను చాలా ఇబ్బందులకు గురిచేశారు.వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం.. రాజశేఖర్‌రెడ్డి మంచోడు.. జగన్ మంచోడు.. పార్టీ నుంచి బయటకు వచ్చినందుకు చెడ్డవాడు అయిపోయాడు. వైఎస్ జగన్‌పై కుట్రలు చేసి జైలుకు పంపించారు. ఎన్నడూ జగన్ తన కష్టాలను మీ దగ్గర చెప్పుకోలేదు. మీ ఇబ్బందులను,కష్టాలను తెలుసుకున్నారు. ప్రత్యేకహోదా,సమైక్యాంధ్ర కోసం ఎన్నో పోరాటాలు చేశారు. వైఎస్ బతికున్న కాలంలో నేను ఏరోజు బయటకు అడుగుపెట్టింది లేదు. ఆ రోజు జగన్‌బయటకు వెళ్ళినప్పుడు..18 మంది ఎమ్మెల్యేలను,ఒక ఎంపీని గెలుపించుకోవడానికి బయటకు వచ్చాను. ఇప్పుడు కూడా మీ అభిమానంతోనే బయటకు వచ్చాను అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు..
20 సంవత్సరాల క్రితం మామ రాజారెడ్డిని హత్యచేశారు. తొమ్మిదేళ్ల క్రితం రాజశేఖర్‌రెడ్డిని పొగొట్టుకున్నాం. అనుమాసద్పంగా ఆయన మరణించారు.నాలుగు నెలల క్రితం జగన్‌ను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో హతమార్చడానికి ప్రయత్నించారు. నాటకాలు, డ్రామాలు వేయడం నా కుమారుడికి రాదని, అందరూ శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరిది వైఎస్ వివేకానందరెడ్డిని కిరాతంగా హత్యచేశారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని అడగడం తప్పా.. చంద్రబాబు ప్రతి మీటింగ్‌లో జగన్ చేశారని మాట్లాడుతున్నారు. వైఎస్ కుటుంబానిది అలాంటి సంస్కృతి కాదు. బయటవారిని సైతం ప్రేమించే కుటుంబం వైయస్ కుటుంబం..హత్య చేసే కుటుంబం కాదు.మామ రాజారెడ్డిని చంపిన ప్రత్యర్థులు ఎదురుగా విచ్చలవిడిగా తిరుగుతున్న కూడా సీఎం స్థాయిలో ఉన్న వైయస్‌ఆర్ చట్టం తనపని తను చేసుకుని పోతుందని వదిలేశారు.కడప జిల్లాలో వైయస్‌ఆర్ రాజకీయాల్లోకి రానప్పుడు 40 ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి.వారి మధ్య రాజారెడ్డి రాజీలు చేసి కలిపారన్నారు. చంద్రబాబుపై బాంబ్ దాడి జరిగినప్పుడు వైఎస్‌ఆర్.. చంద్రబాబు దగ్గర వెళ్ళి హత్తుకుని సానుభూతి తెలిపి ధర్నా చేశారు అని విజయమ్మ గుర్తు చేశారు.