పోచంపల్లిలో 'యాత్ర'
Send us your feedback to audioarticles@vaarta.com
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'యాత్ర'. 70 ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహి వి.రాఘవ్ దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం పోచంపల్లిలోని టూరిజం పార్క్, చెరువు కట్ట సమీపంలో షూటింగ్ జరుపుకుంటుంది.
వై.ఎస్.ఆర్ పాత్రధారి మమ్ముట్టి, సబిత ఇంద్రారెడ్డి పాత్రధారి సుహాసిని కొంత మంది వేర్వేరు వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకునే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
అలాగే ఓ పాటలో బ్యాగ్రౌండ్ స్కోర్‌తో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కృష్ణ కుమార్ సంగీతం, సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు. డిసెంబర్ 21న సినిమా విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com