వైస్సార్ పాత్రలో మమ్మూట్టి 'యాత్ర' మెదటి లుక్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి బయోపిక్ ని వరుసగా భలేమంచి రోజు, ఆనందో బ్రహ్మ లాంటి విజయాలు సాధిస్తున్న నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి లు సంయుక్తంగా ఆనందో బ్రహ్మ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో డా..వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాత్రలో మళయాల సూపర్‌స్టార్ మమ్మూట్టి నటిస్తున్నారు. మమ్మూట్టి తెలుగు లో చాలా కాలం తరువాత నటించడం విశేషం. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9 నుండి ప్రారంభించనున్నారు. ఈ సంధర్బంగా వైఎస్ ఆర్ గెటప్ లో వున్న మమ్మూట్టి మెదటి లుక్ ని విడుదల చేశారు. ఈ బయోపిక్ కి యాత్ర అనే పెర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు.
కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను. మీతో కలిసి నడవాలనుంది. మీ గుండె చప్పుడు వినాలనుంది. అంటూ ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ మేక సమర్పణలో 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ.. 60 రొజుల్లో 1500 కిలోమీటర్స్ కాలి నడకతో కడప దాటి ప్రతి ఇంటి గడప లొకి వెళ్ళి పెదవాడి కష్టాన్ని, అక్కచెల్లెళ్ళ భాదల్ని, రైతుల ఆవేదనని చూసి వారితో కలసి నడిసి వారి గుండె చప్పుడుగా మారి వారి కష్టాల్ని తన కళ్ళతో చూసి బరువెక్కిన గుండెతో ప్రజల హ్రుదయాల్లో స్థానం సంపాయించిన ఎకైన నాయకుడు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.. ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే రైతులకు ఉచిత కరెంటు, విద్యార్థులకి ఫ్రీ రీ-ఎంబార్సిమెంట్, పేదవారికి ఆరోగ్య శ్రీ లాంటి పథకాలతో పాటు మద్యతరగతి వారికి పనికొచ్చే ఎన్నో పథకాలు పెట్టి ఆకట్లుకున్నారు.
అలాంటి మహనేత జీవిత చరిత్ర ని తీసుకుని దర్శకుడు మహి వి రాఘవ దర్శకత్వంలో యాత్ర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9 న ప్రారంభం చేస్తున్నాము. ఇంత వెయిట్ వున్న పాత్రలో నేషనల్ అవార్డు విన్నర్ మళయాలం సూపర్‌స్టార్ మమ్మూట్టి నటించడం చాలా ఆనందం గా వుంది. ఈ రోజు ఈ చిత్రానికి సంబందించిన మెదటి లుక్ ని విడుదల చేశాము. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాము.. అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout