'బాబుకు డిపాజిట్స్ రావు.. జగన్‌దే గెలుపు.. హోదా సాధిస్తాం'
- IndiaGlitz, [Monday,April 08 2019]
ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీకి డిపాజిట్లు రావని తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్దీ తెలుగు రాష్ట్రాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో వేలుపెట్టిన చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మద్దతిచ్చిన విషయం విదితమే. సోమవారం సాయంత్రం వికారాబాద్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన కేసీఆర్.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బాబుకు డిపాజిట్స్ రావు..
ఏపీలో జగన్ బ్రహ్మాండంగా గెలవబోతున్నాడు. జగన్, నేను కలిసి ఏపీకి ప్రత్యేక సాధిస్తాం. చంద్రబాబు ఖేల్ ఖతమైంది.. డిపాజిట్లు కూడా రావు. ఆంధ్రా ప్రజలు మంచోళ్లే.. వాళ్లతో పంచాయితీ లేదు. చంద్రబాబులాంటి వాళ్లతోనే మన పంచాయితీ. మీలా మేం రాజకీయాల కోసం అబద్ధాలు ఆడము. చంద్రబాబు రోజూ నన్ను తిడుతున్నాడు. హైదరాబాద్‌కు చంద్రబాబు శాపాలు పెడుతున్నారు. ఆయనకు డిపాజిట్లు కూడా రావు, కహానీ ఖతం అయింది. చంద్రబాబులా చీకటి పనులు, కుట్రలు చేయం. చంద్రబాబులాంటి కిరికిరిగాళ్లతోనే మనకు పంచాయితీ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
హోదా సాధిస్తాం..
ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇస్తాన్నాడంటే నీకు చెవిలో చెప్పిండా అంటడు. చంద్రబాబు నీలా మేం కాదు. ఏపీకి ప్రత్యేక హోదాకు మా ఎంపీలు మద్దతిస్తారు. పక్క రాష్ట్రం బాగుండాలని మేం కోరుకుంటాం. ఇక్కడ మనం 16సీట్లు.. ఏపీలో జగన్ ఎక్కువ సీట్లు గెలుస్తాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టడానికి మా సంపూర్ణ సహకారం ఉంటుంది. పోలవరానికి మేము అడ్డం రాలేదు.. తెలంగాణను ముంచొద్దన్నాం అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.