ఎంపీగా పోటీచేయనున్న వైఎస్ షర్మిళ?
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత వైఎస్ జగన్ సోదరి షర్మిళ రాజకీయ అరగేంట్రం చేస్తున్నారా..? ఎన్నోరోజులుగా రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆమె కల త్వరలో నెరవేరనుందా..? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచన మేరకు ఒంగోలు నుంచి ఎంపీగా షర్మిళ పోటీ చేస్తున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇవన్నీ నిజమేనని అనిపిస్తోంది.
ఒంగోలు నుంచి గత ఎన్నికల్లో జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పోటీచేసి గెలిచిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీలో క్రియాశీలకంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ తర్వాత పార్టీ కార్యకలపాలన్నీ సుబ్బారెడ్డే దగ్గరుండి చూస్కుంటారు. అయితే రానున్న ఎన్నికల్లో ఆయన్ను రాజ్యసభకు లేదా.. ఎమ్మెల్యేగా పోటీ చేయించి ఒంగోలు నుంచి వైఎస్ షర్మిళను బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎన్నికల వ్యూహకర్త పీకే తన టీమ్‌తో ఒంగోలులో సర్వే చేయించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ ఎక్కువ స్థానాలు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే షర్మిళను ఎంపీగా బరిలోకి దించితే గిద్దలూరు, మార్కాపురం, దర్శి, యర్రగొండపాలెం, కనిగిరి, ఒంగోలుతో పాటు మెజార్టీ స్థానాలు దక్కించుకోవచ్చని పీకే.. వైసీపీ అధిష్టానానికి సూచించారట.
షర్మిళకు టికెట్ ఇస్తే పరిస్థితేంటి..? షర్మిళను ఒంగోలు ప్రజలు ఆదరిస్తారా..? రాజ్యసభకు వెళ్లడానికి సుబ్బారెడ్డి అంగీకరిస్తారా..? గత ఎన్నికల్లో వైఎస్ విజయమ్మకు విశాఖలో ఎదురైన పరిస్థితులే ఒంగోలులో ఎదరువుతాయా లేకుంటే షర్మిళ గెలిచి తన సత్తా ఏంటో చూపుతుందా..? అనే విషయాలు తెలియాలంటే అభ్యర్థుల ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout