YS Sharmila: వైసీపీ ఓటు బ్యాంకే షర్మిల టార్గెట్‌.. కాంగ్రెస్‌లో ఊపందుకున్న చేరికలు..

  • IndiaGlitz, [Wednesday,March 20 2024]

ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి మెల్ల మెల్లగా చేరికలు జోరందుకుంటున్నాయి. ఇతర పార్టీల్లోని అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా హస్తం కండువా కప్పునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నందికొట్కూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పరిగెల మురళీకృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కోడుమూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ పరిగెల మురళీ కృష్ణ గారు వైసీపీ నుంచి కాంగ్రెస్ కుటుంబంలో చేరిన సందర్భంగా ఆయనకు కండువా కప్పి సాదర స్వాగతం పలకడం సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో సమతుల్య అభివృద్ధి, సంక్షేమాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీ కీలకమని మురళీ కృష్ణ గారు భావిస్తున్నందున ఆయన చేరిక పార్టీకి బలం చేకూరుస్తుంది. ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇందిరమ్మ రాజ్యం పట్ల ప్రజల్లో ఉన్న అవసరాన్ని దృఢంగా తెలియజేస్తుంది అని షర్మిల ట్వీట్ చేశారు.

కాగా దశాబ్దాలుగా కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అనంతరం రాష్ట్ర విభజన జరగడంతో కాంగ్రెస్ పార్టీ అస్థిత్వం కోల్పోయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకు మొత్తం వైసీపీ వైపు మళ్లింది. ఇప్పుడు వైఎస్సార్ వారసురాలిగా షర్మిల అధ్యక్షురాలు కావడంతో పార్టీకి జవసత్వాలు వస్తున్నాయి. ఆమె పీసీసీ చీఫ్‌ అయిన దగ్గరి నుంచి రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలతో కాంగ్రెస్ క్యాడర్‌ను ఉత్సాహపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే సైలెంట్ అయిపోయిన సీనియర్లు అందరూ తిరిగి యాక్టివ్ అయ్యారు. అలాగే వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరుకావడం.. షర్మిలకు అండగా ఉంటానని మాట ఇవ్వడంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఈ సభ ఇచ్చిన ఉత్సాహంతో ఎన్నికల్లో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వైసీపీలో తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికప్పుడు అధికారంలోకి రావడం కష్టమే అయినా.. భవిష్యత్‌లో బలమైన ఓటు బ్యాంకుగా మారుతుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అందుకే దూరమైన ఈ వర్గాలను తిరిగి పార్టీలోకి చేర్చుకునేందుకు గేట్లు ఎత్తారు. ఇప్పుడు ఇదే అంశం వైసీపీ నేతలను కలవరపెడుతోంది. తమకు అండగా ఉన్న ఈ వర్గాలు దూరమైతే కనీసం 2శాతం ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందని.. దీంతో అధికారం కోల్పోయే అవకాశాలున్నాయని ఆందోళనకు గురవుతున్నారు. మరి పోలింగ్ తేదీ లోపు మరెన్ని చేరికలు ఉంటాయో.. వైసీపీకి ఎలాంటి షాక్‌లు తగులుతాయో వేచి చూడాలి.

More News

Ustad Bhagat Singh:'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్‌ డైలాగ్స్‌పై ఈసీ ఏమందంటే..? వారికి వార్నింగ్..

ఏపీలో ఎన్నికల వేళ పవన్ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్‌లోని డైలాగులు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.

Pawan Kalyan:పవన్ కల్యాణ్‌కు టీడీపీ నేత వర్మ షాక్.. పోటీలో ఉంటానని స్పష్టం..

కాకినాడ ఎంపీ అభ్యర్థిగా టీటైమ్ యజమాని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Manchu Family :ఏపీలో ఆ పార్టీలకే ఓటు వేయండి.. మంచు కుటుంబం వ్యాఖ్యలు వైరల్..

తిరుపతిలో జరిగిన మోహన్ బాబు(Mohan Babu) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, ముఖేష్ రుషి పాల్గొన్నారు.

KTR:ముఖ్యమంత్రి గారు.. రైతుల కన్నీళ్లు కనిపించవా..?: కేటీఆర్

రైతులను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు చూస్తున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

TDP: ఎలివేషన్లు బారెడు.. వచ్చిన సీట్లు చారెడు.. ఇది టీడీపీ తీరు..

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చే బిల్డప్‌లు ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తానే గతంలో రాష్ట్రపతిని ఎంపిక చేశాను అంటారు.. కంప్యూటర్ కనిపెట్టాను అంటారు.. ఫోన్ కనిపెట్టాను అంటారు..