YS Sharmila-Jagan: మూడేళ్ల తర్వాత అన్న జగన్ను కలిసిన చెల్లెమ్మ షర్మిల
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం, సోదరుడు జగన్ మోహన్ రెడ్డి(CM Jagan)ని వైయస్ షర్మిల(YS Sharmila) కలిశారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల.. అన్న జగన్, వదిన భారతికి శుభలేఖ ఇచ్చి కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించారు. షర్మిల వెంట భర్త అనిల్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం తాడేపల్లి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు మూడేళ్ల తర్వాత జగన్ను కలిశారు.
అంతకుముందు వైఎస్ షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతం పలికారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపడతారనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అభిమానులు, షర్మిల మద్దతుదారులు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తన కుమారుడి పెళ్లి వేడుకకు ఆహ్వాన పత్రికను అన్న జగన్కు అందించడానికి వచ్చానని చెప్పారు. ఇలాంటి వేడుకలకు అందర్నీ ఆహ్వానించాలి కాబట్టి.. తన సోదరుడి వద్దకు వచ్చినట్లు చెప్పారు. అనంతరం అక్కడి నుంచి భారీ బందోబస్తు నడుమ ఆమె తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు.
అలాగే ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తాను కూడా చేరతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల ప్రకారం తాను కూడా నడుచుకుంటానని స్పష్టం చేశారు. కాగా ఢిల్లీ వెళ్లనున్న షర్మిల.. రేపు(గురువారం) ఉదయం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout