YS Sharmila: చంద్రబాబును కలిసిన షర్మిల.. కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం..

  • IndiaGlitz, [Saturday,January 13 2024]

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)ను కాంగ్రెస్ నాయకురాలు వైయస్ షర్మిల(YS Sharmila) కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని కోరుతూ చంద్రబాబు దంపతులకు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న లోకేశ్‌ను సైతం ఆమె ఆహ్వానించారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు.

'నా కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహానికి రావాలని చంద్రబాబు కుటుంబానికి ఆహ్వాన పత్రికను అందజేశాను. తప్పకుండా వివాహానికి హాజరై ఆశీర్వాదం అందజేస్తానని చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా నా తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గతంలో మా కుటుంబంలో జరిగిన శుభకార్యాలకు వైయస్ చంద్రబాబును ఆహ్వానించారు. ఆ అనవాయితీ ప్రకారం నేను కూడా ఆయనకు ఆహ్వానం అందించారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌కు స్వీట్లు పంపాం. కేటీఆర్, కవిత హరీష్ రావుకు కూడా స్వీట్లు పంపాం. ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడి పెట్టవద్దు. రాజకీయాలు మా వృత్తి. ప్రజాపోరాటంలో భాగంగా పరస్పరం విమర్శలు చేసుకుంటాం. అంతేకానీ వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా తప్పకుండా నెరవేరుస్తానని'అని షర్మిల తెలిపారు.

కాగా షర్మిల కుమారుడు రాజారెడ్డికి.. ప్రియా అట్లూరితో ఈ నెల 18న నిశ్చితార్థం, ఫిబ్రవరి 17న వివాహం జరగనుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. వీరితో పాటు మరికొంత మంత్రులు, సీనియర్ నేతలను కూడా ఆమె ఆహ్వానించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రస్తుతం కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆమెకు కాంగ్రెస్ కీలక బాధ్యతలు అప్పగించనుంది. దీంతో అప్పటి నుంచి షర్మిల ఇక రాజకీయాల్లో బిజీ కానున్నారు.

More News

Ram Charan-Upasana: రామ్‌చరణ్‌ దంపతులకు అయోధ్య నుంచి ఆహ్వానం

యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం మరో పది రోజుల్లో జరగనుంది. ఈ వేడుక కోసం అయోధ్య అందంగా ముస్తాబవుతోంది.

Nagarjuna: మహేశ్‌తో మల్టీస్టారర్ మూవీపై నాగార్జున ఏమన్నారంటే..?

ఈసారి సంక్రాంతి రేసులో కింగ్ నాగార్జున కూడా నిలిచిన సంగతి తెలిసిందే. 'నా సామిరంగ' మూవీతో భోగి రోజు ప్రేక్షకులను పలకరించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా..

Anganwadi: అంగన్‌వాడీలకు ప్రభుత్వం డెడ్‌లైన్‌.. కొత్త వారిని తీసుకుంటామని హెచ్చరిక..

అంగన్‌వాడీలు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే కొత్త వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. అంగన్‌వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు

YS Jagan: గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం జగన్

ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగున్నాయి. దీంతో అధికార వైసీపీ గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహాలతో ముందకెళ్తోంది. ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ ఇటు పరిపాలనతో పాటు

CM Revanth Reddy: పెట్టుబడులే లక్ష్యం.. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ ఇదే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పది రోజుల పాటు ఢిల్లీ, విదేశాల పర్యటన చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఏఐసీసీ సమావేశంలో పాల్గొడంతో పాటు అగ్రనేతలతో భేటీ కానున్నారు.