YS Sharmila:రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైయస్ షర్మిల

  • IndiaGlitz, [Thursday,January 04 2024]

వైయస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో అధికారికంగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ వైఎస్సార్టీపీ(YSRTP) విలీనం అయింది. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త అనిల్, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఎట్టకేలకు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ముగింపు పడింది.

నాన్న అడుగుజాడల్లో నడుస్తా..

పార్టీలో చేరిన అనంతరం షర్మిల మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్‌ జీవితమంతా కాంగ్రెస్‌ కోసమే పనిచేశారని తెలిపారు. రాహుల్‌ గాంధీని దేశ ప్రధానిగా చూడటమే నాన్న కల అని.. తాను కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం చేసే సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శక్తివంచన లేకుండా కృషిచేస్తా అని ఆమె వెల్లడించారు. అయితే షర్మిలకు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగిస్తారా? ఏఐసీసీ పదవి ఇస్తారా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.

ముగిసిన వైఎస్సార్టీపీ ప్రస్థానం..

కాగా తెలంగాణలో సొంతంగా రాజకీయ జీవితం ప్రారంభించిన షర్మిల 2021 జులై8న వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం దాదాపు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్ర చేశారు. అప్పటి సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. ఎన్నికలకు ముందే ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ ఎన్నికల దృష్ట్యా ఆమె చేరిక ఆలస్యమైంది. మొత్తానికి కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండానే YSRTP ప్రస్థానం ముగిసింది.

More News

AP CM Jagan:మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ను ఏపీ సీఎం వైయస్ జగన్‌(YS Jagan) పరామర్శించారు.

Sasivadane:హృదయాన్ని హత్తుకుంటున్న 'శశివధనే' టీజర్..

గోదావరి నేపథ్యంలో వచ్చే సినిమాలు ఓ కొత్త అనుభూతిని మిగిలిస్తూనే ఉంటాయి. నది చుట్టూ ప్రాంతాలు, కొబ్బరి చెట్లు, పచ్చటి వాతావరణం చుట్టూ సాగే కథలు

YS Sharmila-Jagan: మూడేళ్ల తర్వాత అన్న జగన్‌ను కలిసిన చెల్లెమ్మ షర్మిల

ఏపీ సీఎం, సోదరుడు జగన్‌ మోహన్ రెడ్డి(CM Jagan)ని వైయస్ షర్మిల(YS Sharmila) కలిశారు. తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన షర్మిల.. అన్న జగన్, వదిన భారతికి శుభలేఖ ఇచ్చి

Janasena: జనసేన పార్టీలో చేరిన కాంగ్రెస్, వైసీపీ నాయకులు

2024లో రాష్ట్రంలో పెద్ద మార్పును తీసుకురాబోతున్నామని.. ప్రభుత్వంలో బలమైన భాగస్వామ్యం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు.

సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే..?

సంక్రాంతి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం ఆరు రోజుల పాటు పండుగ సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 12 నుంచి 17వ తేది వరకు హాలీడేస్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.