KCR: వైఎస్ షర్మిల డబ్బు కట్టలు పంపుతున్నారు.. సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Monday,November 13 2023]

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల కక్ష కట్టిందని తీవ్ర ఆరోపణలు చేశారు. నర్సంపేట ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డిని ఓడించేందుకు షర్మిల డబ్బు కట్టలు పంపుతున్నారట.. మీరు తిప్పికొట్టి పెద్ది సుదర్శన్‌రెడ్డిని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ప్రజలు పార్టీల చరిత్రలు చూసి ఓటెయ్యండని విజ్ఞప్తి చేశారు. ఓటు అంటే ఆశామాషీ కాదు... తలరాతలు మార్చే గీత అన్నారు. గతంలో నర్సంపేటలో ఎవరూ చేయని అభివృద్ధిని పెద్ది సుదర్శన్ రెడ్డి చేశారని తెలిపారు. వ్యవసాయం అంటే తెలియని రాహుల్ గాంధీ కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ఇక అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో నిర్వహించిన బహిరంగసభలో కేసీఆర్ ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీనే అణచివేసిందని విమర్శించారు. 2004లో ఇవ్వాల్సిన ప్రత్యేక తెలంగాణను పదేళ్లు ఆలస్యం చేసి 2014లో ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు రాగానే కొన్ని పార్టీలు పచ్చి అబద్ధాలు చెబుతూ.. అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. నేతల కన్నా ప్రజలు గెలవడమే ముఖ్యమన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతులకు మూడు గంటల కరెంటు చాలని చెబుతున్నారని విమర్శలు చేశారు. ఆయన అహంకారం ఏంటో అర్థం కావట్లేదని.. మీకు 24 గంటల కరెంట్‌ కావాలా? 3 గంటల కరెంట్‌ కావాలా? తేల్చుకోండన్నారు. అధికారం ఇస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని పదే పదే చెబుతున్నారని.. కాంగ్రెస్‌ వస్తే ధరణిని తీసేస్తారని కేసీఆర్ మరోసారి పునరుద్ఘటించారు.

More News

Tula Uma: బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తుల ఉమ.. బీజేపీపై తీవ్ర విమర్శలు..

నాలుగు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు తెరపడింది. బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె గులాబీ కండువా కప్పుకున్నారు.

Rahul Gandhi: గెలుపు కోసం కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్.. ఆరు రోజుల పాటు రాహుల్ గాంధీ ప్రచారం

తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటుంది. పోలింగ్‌కు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

Salman Khan: థియేటర్‌లో టపాసులు కాల్చడంపై సల్మాన్‌ ఖాన్ ఆందోళన

తమ హీరో సినిమా రిలీజ్ అయితే చాలు అభిమానులు చేసే సందడి అంత ఇంత కాదు. అభిమాన హీరోను వెండితెరపై చూస్తూ థియేటర్లలో

KTR: నాంపల్లి అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం: కేటీఆర్

నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.5లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Lal Salaam Teaser: 'లాల్ సలాం' టీజర్‌లో మొయిద్దీన్ భాయ్‌గా దుమ్మురేపిన రజనీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల 'జైలర్' మూవీతో సూపర్ హిట్ అందుకుని అభిమానులను అలరించారు. తాజాగా ఆయన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన 'లాల్ సలాం' సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.