YS Sharmila:సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ షర్మిల కౌంటర్.. మీ కథ మీరు చూసుకోండి..
Send us your feedback to audioarticles@vaarta.com
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు తమతో సంబంధం లేదని సజ్జల అన్నారు కదా.. మరి ఇప్పుడు ఏ సంబంధం ఉందని ఆయన తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తమతో సంబంధం లేని వాళ్లు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని.. దీనిపై సజ్జల సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఓవైపు సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ.. డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ.. చీకట్లు ఉంటే ఏపీ.. వెలుగులు ఉంటే తెలంగాణ.. అని సీఎం కేసీఆర్ బహిరంగంగా విమర్శిస్తున్నారని.. ఈ వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు? ముందు మీ కథ మీరు చూసుకోండి అని సెటైర్లు వేశారు. అనంతరం సజ్జల మాట్లాడారంటే దాదాపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినట్లే అని విలేకరులు ప్రశ్నించగా.. ఎవరైనా సరే తన సమాధానం ఇదేనని ఆమె స్పష్టంచేశారు. షర్మిల తాజా వ్యాఖ్యలతో వైఎస్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. పోటీకి షర్మిల దూరం కావడంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ జగన్మోహన్రెడ్డిని ఏ పార్టీ అయితే వేధించి అక్రమ కేసులు పెట్టిందో ఆ పార్టీతో షర్మిల కలవడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు అని.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమని.. తమకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిందని.. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసుని వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com