YS Sharmila:సజ్జల రామకృష్ణారెడ్డికి వైఎస్ షర్మిల కౌంటర్.. మీ కథ మీరు చూసుకోండి..

  • IndiaGlitz, [Monday,November 06 2023]

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో తాను పార్టీ పెట్టినప్పుడు తమతో సంబంధం లేదని సజ్జల అన్నారు కదా.. మరి ఇప్పుడు ఏ సంబంధం ఉందని ఆయన తన గురించి మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. తమతో సంబంధం లేని వాళ్లు తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని.. దీనిపై సజ్జల సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఓవైపు సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ.. డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ.. చీకట్లు ఉంటే ఏపీ.. వెలుగులు ఉంటే తెలంగాణ.. అని సీఎం కేసీఆర్ బహిరంగంగా విమర్శిస్తున్నారని.. ఈ వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు? ముందు మీ కథ మీరు చూసుకోండి అని సెటైర్లు వేశారు. అనంతరం సజ్జల మాట్లాడారంటే దాదాపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినట్లే అని విలేకరులు ప్రశ్నించగా.. ఎవరైనా సరే తన సమాధానం ఇదేనని ఆమె స్పష్టంచేశారు. షర్మిల తాజా వ్యాఖ్యలతో వైఎస్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయిలో ఉన్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. పోటీకి షర్మిల దూరం కావడంపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ అయితే వేధించి అక్రమ కేసులు పెట్టిందో ఆ పార్టీతో షర్మిల కలవడాన్ని ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలు అని.. ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమని.. తమకు ఈ రాష్ట్రానికి చెందిన విషయాలే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిందని.. ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసుని వ్యాఖ్యానించారు.

More News

శ్రీవారిని దర్శించుకున్న త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి

పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. త్రిపుర గవర్నర్ నల్లా ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు.

Jagananna Suraksha: అందరికీ రక్షణగా జగనన్న ఆరోగ్య సురక్ష

ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇక నుంచి ఓ లెక్క.. అన్నట్లు సీఎం జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలని

ఏపీలో విద్యా సంస్కరణలు భేష్.. నెదర్లాండ్స్ వేదికగా ప్రశంసలు..

ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం చేపడుతున్న విద్యా సంస్కరణలపై అంతర్జాతీయ వేదికగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Game Changer : రామ్ చరణ్ - శంకర్ ‘‘గేమ ఛేంజర్’’ సినిమా సాంగ్ లీక్ , ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్

అప్పట్లో పైరసీ భూతం తెలుగు సినిమాను పట్టి పీడంచగా.. ఇప్పుడు లీకులు బెడద వెంటాడుతోంది.

AP GST:జీఎస్టీ వసూళ్లలో దుమ్మురేపిన ఏపీ.. సౌత్‌లోనే నంబర్ 1 స్టేట్‌గా రికార్డ్..

ఏపీలో జీఎస్టీ వసూళ్లు దుమ్మురేపాయి. రాష్ట్రంలో అభివృద్ధి ప్రగతి పథంలో దూసుకుపోతుంది అనడానికి జీఎస్టీ వసూళ్లే ప్రత్యక్ష ఉదహరణగా నిలుస్తున్నాయి.