జగన్ మరో కీలక నిర్ణయం: డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు

  • IndiaGlitz, [Friday,December 13 2019]

అవును మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తానేంటో కేవలం ఎనిమిది నెలల్లోనే నిరూపించుకున్నారు. ఇప్పటికే పలు కీలక చట్టాలను.. సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్.. తాజాగా ‘దిశ చట్టం’ చట్టం తీసుకొచ్చిన విషయం విదితమే. అయితే ఆ చట్టం శాసనసభ, శాసన మండలిలో ఆమోదించిన రోజే.. మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఏపీలో డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు కానుందన్నదే ఆ నిర్ణయం సారాంశం. విద్యార్థులు చదువుకునే కోర్సులు ఉద్యోగాలు తెచ్చిపెట్టే విధంగా ఉండాలని జగన్ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు!

‘ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మేలు చేస్తాయి. ఏపీలోని విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాం. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లు చేసి.. ఒక సంవత్సరం జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం. బీటెక్ కోర్సును కూడా ఐదేళ్లు చేసిన ఇదే రకమైన విధానాన్ని అమలు చేయాలని అనుకుంటున్నాం. కాలేజీ, యూనివర్సిటీల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు... తాము చదువుకున్న విద్యాసంస్థలకు ఎంతో కొంత మేలు చేయాలి. స్కాలర్ షిప్స్ విషయంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును తాము భరించే విధంగా పూర్తిస్థాయిలో స్కాలర్ షిప్స్ ఇస్తాం’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

More News

‘హీ ఈజ్ సో క్యూట్’.. మహేశ్‌పై రష్మిక టిక్ టాక్ వీడియో

సూపర్‌స్టార్‌ మహేష్‌, రష్మిక మందన్నా నటీనటులుగా టాలెంటెడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’.

పెళ్లి వదంతులపై క్లారిటీ ఇచ్చేసిన కాజల్

సినీ ఇండస్ట్రీలో మోస్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో.. టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపేసిన కాజల్ అగర్వాల్ కూడా ఉంది.

సానియా మీర్జా చెల్లెలి రిసెప్షన్‌లో చెర్రీ, ఉపాసన సందడి

టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ తనయుడు అసద్, టెన్నిస్ రారాణి సానియా మీర్జా సోదరి ఆనమ్‌ల వివాహం ఇటీవలే ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

ఏపీలో ‘దిశ’ చట్టం వచ్చేసింది.. వేధించారో అంతే సంగతులు!

నిర్భయ లాంటి ఘటనల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట వేయడానికి కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ..

నవ్యాంధ్ర రాజధాని మార్పుపై అసెంబ్లీలో కీలక ప్రకటన

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై సస్పెన్స్.. సస్పెన్స్. అసలు రాజధాని అమరావతిలోనే పెడతారా..?