Jagananna Colony: రాష్ట్రానికి గృహ శోభ.. అక్కాచెల్లెమ్మలకు అన్నగా అండగా సీఎం వైయస్ జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలబడ్డారు. ప్రతి చెల్లీ, ప్రతి అక్కా సొంత ఇంట్లో ఆత్మగౌరవంతో జీవించాలని ఆయన సంకల్పించారు. ఆ సంకల్పంలో భాగంగానే 30.75 లక్షల మందికి రూ.76,000 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలకు సంబంధించి పట్టాలు అందజేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 21.76 లక్షల గృహాల నిర్మాణానికి రూ.56,700 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖజానాలో అంత సొమ్ము లెక్కపోయినా తనను నమ్ముకున్న అక్కాచెల్లెమ్మలకు ఎలాగైనా న్యాయం చేయాలని దృఢ సంకల్పం ముందు అవేవీ ఆయన్ను ఆపలేకపోయాయి.
ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో ఉండేలా..
దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా జగనన్నకాలనీల కోసం స్థలసేకరణ జరిగింది. అక్కడ ఇళ్ళు నిర్మించేందుకు వీలుగా రోడ్లు, నీళ్లు, విద్యుత్, పార్కుల వంటి మౌలిక సదుపాయాలు సమకూర్చారు. ఈ నేపథ్యంలో మెల్లగా ఇళ్ల నిర్మాణం మొదలవుతోంది. ఒక్కొక్కరూ తమకు ఇచ్చిన జాగాలో ప్రభుత్వ సాయంతో ఇల్లు కట్టుకుంటున్నారు. ఎంత తక్కువగా లెక్కేసినా ఒక్కో ఇంటి ధర ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.15 లక్షలు ఉంటుందని అంచనా. అంటే సీఎం జగన్ ఆలోచనలు వాస్తవరూపం దాలుస్తుండడంతో రాష్ట్రంలో పేదల జీవన స్వరూపమే మారుతోంది. ఇళ్లు లేని పేదలు ఇక మీదట ఆత్మగౌరవంతో సొంత ఇంట్లో ఉండొచ్చు.
లబ్ధిదారులకు గృహాలను అందజేసిన సీఎం జగన్..
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యమం మాదిరిగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న అధికారులు అటు లబ్ధిదారులకు అన్నిరకాలుగా తోడ్పాటును అందిస్తున్నారు. ఇటుక, సిమెంట్, కంకర, ఐరన్, తలుపులు, గుమ్మాలు, కిటికీలను సైతం సమకూరుస్తూ నిర్మాణం త్వరగా అయ్యేలా చూస్తున్నారు. ఇప్పటికే ఈ పథకం కింద 5.24 లక్షల గృహాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దాదాపు 2,412 ఇళ్లను పూర్తి చేసుకున్న సామర్లకోట పట్టణంలో లబ్ధిదారులకు సీఎం జగన్ వాటిని అందజేశారు. ఆ కాలనీల్లో ఇప్పటికే పార్కులు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం అక్కడ నివాసానికి సకలం సమకూర్చింది. ఈ సందర్భంగా లబ్ధిదారులతో పాటు జగన్ మోహన్ రెడ్డి సైతం వారి సంతోషాల్లో భాగం పంచుకున్నారు. పేదల ఇళ్లలో చిరునవ్వులు పూయించేందుకు సీఎం వైయస్ జగన్ చేస్తున్న కృషి ఫలవంతం అవుతున్నందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com