వైఎస్‌ను మించి.. మళ్లీ మళ్లీ జగనే సీఎం!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో వైసీపీ గెలుపొందగా.. ఫ్యాన్ గాలికి అటు సైకిల్ గానీ ఇటు గ్లాస్ కానీ దరిదాపుల్లోకి రాలేకపోయాయి. ఆదిలోనే సైకిల్ పంచర్ కాగా.. గ్లాస్ మాత్రం ముక్కి మూలిగి ముక్కలైంది!. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం నాడు ప్రమాణం చేశారు. ఈ మహోత్తర కార్యక్రమానికి అతిరథ మహారథులు, రాజకీయ-సినీ ప్రముఖులు, భారీగా కార్యకర్తలు, అభిమానులు, నేతలు తరలివచ్చారు. కాగా కార్యక్రమానికి రావడానికి వీలుకాని నేతలు, సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదిగా అభినందనలు తెలుపుతున్నారు.
నాకు నమ్మకముంది!
తాజాగా.. వైసీపీ నేత, టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు.. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా గురువారం సాయంత్రం ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్‌కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్. జగన్‌కు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జగన్‌కు తన పదవీకాలంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. జగన్ తన తండ్రి వైఎస్సార్ ను మించి గొప్పవాడు అవుతాడు. అందులో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని పర్యాయాలు జగనే సీఎంగా ఉంటాడు" అని జగన్‌ను ఉద్దేశించి మంచు ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌కు పలువురు అభిమానులు ఆయనకు పాజిటివ్‌గా కామెంట్స్ చేయగా.. మరికొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
మంచు విష్ణు దంపతులు కూడా!
ఎన్నికలకు ముందు మంచు ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకుంది. ఎన్నికల్లో తిరుపతితో పాటు పలు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేసింది ఈ ఫ్యామిలీ. మరోవైపు.. వైఎస్ కుటుంబం నుంచి మంచు కుటుంబం వియ్యం అందుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల ఫలితాల అనంతరం మంచు విష్ణు దంపతులు జగన్‌ను కలిసి అభినందనలు తెలియజేయడంతో పాటు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరై ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్ కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చాడు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్.
— Mohan Babu M (@themohanbabu) May 23, 2019
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments