వైఎస్‌ను మించి.. మళ్లీ మళ్లీ జగనే సీఎం!

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో భారీ మెజార్టీతో వైసీపీ గెలుపొందగా.. ఫ్యాన్ గాలికి అటు సైకిల్ గానీ ఇటు గ్లాస్ కానీ దరిదాపుల్లోకి రాలేకపోయాయి. ఆదిలోనే సైకిల్ పంచర్ కాగా.. గ్లాస్ మాత్రం ముక్కి మూలిగి ముక్కలైంది!. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం నాడు ప్రమాణం చేశారు. ఈ మహోత్తర కార్యక్రమానికి అతిరథ మహారథులు, రాజకీయ-సినీ ప్రముఖులు, భారీగా కార్యకర్తలు, అభిమానులు, నేతలు తరలివచ్చారు. కాగా కార్యక్రమానికి రావడానికి వీలుకాని నేతలు, సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదిగా అభినందనలు తెలుపుతున్నారు.

నాకు నమ్మకముంది!

తాజాగా.. వైసీపీ నేత, టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్‌ బాబు.. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా గురువారం సాయంత్రం ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే.. శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు తన బిడ్డ జగన్‌కి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారు. జగన్ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాడు. ప్రజలు ఆశీస్సులు అందచేసి ముఖ్యమంత్రిని చేసారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్. జగన్‌కు దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జగన్‌కు తన పదవీకాలంలో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. జగన్ తన తండ్రి వైఎస్సార్ ను మించి గొప్పవాడు అవుతాడు. అందులో ఎలాంటి సందేహంలేదు. మరిన్ని పర్యాయాలు జగనే సీఎంగా ఉంటాడు అని జగన్‌ను ఉద్దేశించి మంచు ట్వీట్ చేశారు. కాగా ఈ ట్వీట్‌కు పలువురు అభిమానులు ఆయనకు పాజిటివ్‌గా కామెంట్స్ చేయగా.. మరికొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

మంచు విష్ణు దంపతులు కూడా!

ఎన్నికలకు ముందు మంచు ఫ్యామిలీ వైసీపీ తీర్థం పుచ్చుకుంది. ఎన్నికల్లో తిరుపతితో పాటు పలు స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేసింది ఈ ఫ్యామిలీ. మరోవైపు.. వైఎస్ కుటుంబం నుంచి మంచు కుటుంబం వియ్యం అందుకున్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎన్నికల ఫలితాల అనంతరం మంచు విష్ణు దంపతులు జగన్‌ను కలిసి అభినందనలు తెలియజేయడంతో పాటు ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా హాజరై ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

More News

ప్రధానిగా రెండోసారి మోదీ ప్రమాణం.. 2.0 టీమ్ ఇదే..

నరేంద్ర మోదీ రెండోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో సరిగ్గా సాయంత్రం 7గంటలకు ఈ మహోత్తర కార్యక్రమం జరిగింది.

జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వీళ్లంతా ఎందుకు రాలేదు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో విజయడంఖా మోగించి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.

ఈద్‌కి 'సాహో' స్పెష‌ల్ గిఫ్ట్

ఈద్‌.. ముస్లిం సోద‌రులు ఘ‌నంగా చేసుకునే పండుగ‌. ఈ పండుగ‌కు ముస్లిం సోద‌రుల‌ను ఖుష్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు ప్ర‌భాస్‌.

ముగ్గురిలో.. క్రిష్ ఒక‌ర‌న్న‌మాట‌

ముగ్గురు హీరోయిన్లు, ముగ్గురు ద‌ర్శ‌కులు.. ఓ స్టార్ డైర‌క్ట‌ర్ సినిమా. ఇదీ ఈ మ‌ధ్య అంద‌రి నోళ్ల‌ల్లో నానుతున్న విష‌యం.

అద్గ‌ది... బంగార్రాజా మ‌జాకా

`సోగ్గాడే చిన్నినాయ‌నా` సినిమాను చూసిన వాళ్లంద‌రూ నాగార్జున అన్న త‌స్సాదియ్యా.. అద్గ‌దిగ‌ది అనే ప‌దాలు గుర్తుండే ఉంటాయి.