YS Jagan Vision: ఇది విజన్.. అందుకే జగన్ మళ్లీ అధికారంలోకి రావాలి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓవైపు అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. సీఎం జగన్ నిర్వహిస్తున్న సభలు, రోడ్డు షోలకు జనం పోటెత్తుతున్నారు. మేమంతా జగనన్న వెంటే అంటూ నినదిస్తు్న్నారు. మరోవైపు సీఎం జగన్ తన ఐదేళ్లలో ఏం చేశారని ప్రజలు మళ్లీ ఓట్లు వేయాలని ప్రశ్నిస్తు్న్నారు. దీనికి సమాధానంగా జగన్ మళ్లీ ఎందుకు రావాలో వైసీపీ నేతలు వివరిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఏం మంచి పనులు చేశారో ఆధారాలతో సహా చూపిస్తున్నారు.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే "రెండున్నర లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు, ప్రభుత్వ పథకాలను మీ గడప ముందుకే చేరుస్తున్నారు. 15వేల సచివాలయాల్లో 550కిపైగా ప్రభుత్వ సేవలు మీ ఇంటి ముందుకే తీసుకొచ్చారు. నాడు-నేడు పేరుతో రూ.17వేల కోట్లతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చారు. ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్, జైజూస్ కంటెంట్, ట్యాబ్స్‌తో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. అలాగే అమ్మ ఒడి పథకంతో పిల్లల్ని బడికి పంని ప్రతి తల్లి ఖాతాలో 15వేల రూపాయలు వేస్తున్నారు" అని వివరిస్తున్నారు.
అంతేకాకుండా "రాష్ట్రంలో 10వేలకు పైగా విలేజ్ క్లినిక్‌లు అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25లక్షలకు పెంచారు.17 కొత్త వైద్యశాలలు నిర్మిస్తున్నారు. 58 నెలల్లో రాష్ట్రానికి 130 భారీ పరిశ్రమలు తెచ్చారు. లక్షా 130కోట్ల రూపాయల పెట్టుబుడులు సాకారం చేశారు. మత్స్యకారులకు అండగా 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ 4 పోర్టులు నిర్మిస్తున్నారు. దేశచరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి లక్షా 30వేల సచివాలయ ఉద్యోగాలు. ఈ ఐదేళ్లలో మొత్తం 2లక్షల 21వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు" అని పేర్కొంటున్నారు.
ఇక "ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 22లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు. ఇటు కేబినెట్‌లో.. అటు నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రభాగం కల్పించారు. వెనకబడిన వర్గాలకు డీబీటీ ద్వారా 2లక్షల 70వేల కోట్లు అందించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అక్కచెల్లెమ్మలకు 31లక్షల 40వేల ఇళ్ల పట్టాలు ఇచ్చారు. గృహయజ్ఞం ద్వారా రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు రెండున్నర నుంచి 3లక్షల కోట్ల రూపాయల ఆస్తి సృస్టించారు. అవినీతికి తావు లేకుండా 66లక్షల మంది పింఛన్ దారులకు 77వేల కోట్ల బబ్ధి చేకూర్చారు. రాష్ట్రంలో తాగు, సాగు నీటి ప్రాజెక్టుల కోసం 32వేల కోట్లు ఖర్చు చేశారు. రైతు భరోసాతో 52లక్షల మంది రైతన్నలకు 31వేల కోట్లు సాయంగా అందించారు. అని చెప్పుకొచ్చారు. ఇన్ని మంచి పనులు చేశారు కాబట్టే ముఖ్యమంత్రిగా జగన్ మళ్లీ ప్రమాణస్వీకారం చేయాలంటూ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com