జగన్‌కు సీన్ అర్థమైంది.. చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయం!

  • IndiaGlitz, [Saturday,May 11 2019]

ఏపీలో టీడీపీ విజయం సాధించడం ఖాయమని.. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యి దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పి, దేశ ప్రధానిని నిర్ణయిస్తారని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబి రాజేంద్రప్రసాద్  చెప్పుకొచ్చారు. శనివారం ఉదయం విజయవాడ టీడీపీ కార్యాలయం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల మోదీ-చంద్రబాబు మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రధాని హోదాకు ఉన్న ఉన్నత స్థానాన్ని దిగజార్చేలా మోదీ మాటలున్నాయని విమర్శలు గుప్పించారు. ఓడిపోతున్నామనే దుగ్ధతో చంద్రబాబు పై మోదీ విమర్శలు చేస్తున్నారన్నారని చెప్పుకొచ్చారు.

జగన్‌కు సీన్ అర్థమైంది.. అందుకే..!

ఈవీఎం వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నా ఎందుకు పట్టించుకోరు. వీవీ ప్యాట్‌ స్లిప్పుల‌ను లెక్కిస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి? ఆలస్యం అవుతుందనే సాకుతో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. మీ ఎన్నికల కోసం రెండు నెలల్లో నోటిఫికేషన్ ఇచ్చిన మీకు వివి ప్యాట్‌లు లెక్కించడం కష్టమా..?. పూర్తి పారదర్శకంగా ఉంటుందనే వీవీ ప్యాట్‌లు లెక్కించాలని చంద్రబాబు కోరుతున్నారు.

మరి మీరెందుకు భుజాలు తడుముకుని అడ్డుపడాలని చూస్తున్నారు..? మోదీ, వైఎస్ జగన్, కేసీఆర్ చేసిన కుట్రలను చంద్రబాబు ఒంటి చేత్తో తిప్పి కొట్టారు. పోలింగ్ అయిన నాటి నుంచి నేటి వరకు జగన్ ప్రజల్లోకి రావడం మానేశారు. తుఫాన్, తాగునీటి ఇబ్బందులతో అల్లాడుతుంటే.. కనీసం పరామర్శించలేదు. లోటస్ పాండ్ ఏసీ గదుల్లో కూర్చొన్న జగన్ ఏపీని మరచిపోయాడు. ఎలాగూ ఓడిపోతున్నామనే విషయం జగన్‌కు అర్ధమైంది

చేసిన అవినీతికి ఆంధ్రా ప్రజలు మరోసారి జగన్‌కు బుద్ది చెప్పారు. విజయసాయి రెడ్డి విషపు సాయి రెడ్డిగా మారి దుష్ప్రచారం చేస్తున్నారు. కేసిఆర్, జగన్‌లు మొన్నటి వరకూ మోదీతో మంతనాలు చేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలుస్తుందని తెలిసి రాహుల్ గాంధీ జపం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నారు అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. కాగా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

More News

'ట్రాప్' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

బ్రహ్మాజీ , మహేంద్ర , షాలు, కాత్యాయని శర్మ, ముఖ్య పాత్రలలో నటించిన సినిమా 'ట్రాప్'..

పవన్ రాజకీయాల్లో ఉంటారా.. సినిమాల్లో ఉంటారా..!

ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ సినిమాల్లోకి వెళతారా..?

లేడీ విల‌న్‌తో బాల‌య్య ఢీ

నంద‌మూరి బాల‌కృష్ణ 105వ సినిమా ఈ నెల 17న లాంఛ‌నంగా ప్రారంభంకానుంది. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ముహూర్తం కుదిరింది..

హీరో, నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడు, న‌డిగ‌ర్ సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విశాల్ త్వ‌రలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

సుప్రీమ్ కోర్టు న్యాయ‌మూర్తిపై పోరాటం చేయ‌నున్న చిన్న‌యి

ద‌క్షిణాదిన మీటూ ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపింది చిన్మ‌యి. సీనియ‌ర్ రైట‌ర్ వైర‌ముత్తు, సీనియ‌ర్ న‌టుడు రాధార‌విపై మీ టూ పోరాటంలో భాగంగా లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది.