పాలన పై జగన్ పట్టు.. చంద్రబాబు టీమ్ ఔట్

  • IndiaGlitz, [Thursday,May 30 2019]

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై పట్టుబిగించేందుకు చర్యలు షురూ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల్లోనే జగన్ తన మార్కేంటో చూపించారు. గురువారం నాడు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయంలో కొనసాగుతున్న నలుగురు ముఖ్య అధికారులకు వైఎస్ జగన్ సడన్ షాకిచ్చారు. సీఎం అయిన కొన్ని నిమిషాల్లో నలుగురు ముఖ్య అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో తేల్చిచెప్పేశారు. కాగా వీరంతా చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన వారు కావడం.. పలు ఆరోపణలు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బదిలీ అయిన అధికారులు వీరే..

సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న సతీశ్‌ చంద్ర

సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌

గతంలో ముఖ్యమంత్రి కార్యదర్శులుగా ఉన్న గిరిజాశంకర్‌, అడుసుమిల్లి రాజమౌళి.. వీరందర్నీ బదిలీ చేస్తున్నట్లు సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ముఖ్య శాఖల నుంచి వీరందర్నీ సాధారణ శాఖలకు రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు.

జగన్ పోస్టింగ్‌లు ఇచ్చింది వీరికే..

పలువుర్ని బదిలీ చేసిన వైఎస్ జగన్ సీఎంవోలో తొలి పోస్టింగ్ ఉత్తర్వును సైతం ఇచ్చారు. టూరిజం శాఖ ఎండీగా పనిచేస్తున్న ధనుంజయ్‌ రెడ్డిని సీఎం అదనపు కార్యదర్శిగా నియమించారు. కాగా మరికొంత ప్రధాన అధికారులు బదిలీ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికారులు సక్రమంగా ఉంటే పరిపాలన మంచిగా ఉంటుందని.. ప్రభుత్వాలు నిలబడాలన్నా.. కుప్పకూలిపోవాలన్నా నేతలకంటే అధికారులే కీలకమన్న విషయం తెలిసిందే. అందుకే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం మరుక్షణం నుంచే చంద్రబాబుకు టీమ్‌లోని అధికారులందరికీ వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మున్ముంథు మరింత మంది ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు బదిలీలు జరిగే అవకాశముంది.

More News

ప్రమాణానికి ముందు జగన్‌కు చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. విజయవాడలోని ఇందిరిగాంధీ స్టేడియం వేదికగా..

కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కిన 42 మంది నేతలు వీరే..

భారతీయ జనతాపార్టీ ఎవరు సపోర్టు లేకుండా స్వతంత్రంగా పోటీచేసి ఎవరూ ఊహించని రీతిలో సీట్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం మోదీ మానియా.. షా చరిష్మా మాత్రమేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జగన్, కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు నో పర్మిషన్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.

భావోద్వేగంతో ప్రసంగం.. పెన్షన్‌పై జగన్ తొలి సంతకం.. మీడియాకు వార్నింగ్!

అవినీతి రహిత పాలన అందించేందుకు పాలనలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తానని.. ప్రజలందరి ముఖాల్లో సంతోషం నింపడమే ధ్యేయంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

అజయ్ 'స్పెషల్' జూన్ 14న రిలీజ్

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో