పాలన పై జగన్ పట్టు.. చంద్రబాబు టీమ్ ఔట్
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనపై పట్టుబిగించేందుకు చర్యలు షురూ చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నిమిషాల్లోనే జగన్ తన మార్కేంటో చూపించారు. గురువారం నాడు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యాలయంలో కొనసాగుతున్న నలుగురు ముఖ్య అధికారులకు వైఎస్ జగన్ సడన్ షాకిచ్చారు. సీఎం అయిన కొన్ని నిమిషాల్లో నలుగురు ముఖ్య అధికారులను బదిలీ చేస్తున్నట్లు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వుల్లో తేల్చిచెప్పేశారు. కాగా వీరంతా చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగిన వారు కావడం.. పలు ఆరోపణలు రావడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బదిలీ అయిన అధికారులు వీరే..
సీఎంవో ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్న సతీశ్ చంద్ర
సీఎంవో ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్
గతంలో ముఖ్యమంత్రి కార్యదర్శులుగా ఉన్న గిరిజాశంకర్, అడుసుమిల్లి రాజమౌళి.. వీరందర్నీ బదిలీ చేస్తున్నట్లు సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ముఖ్య శాఖల నుంచి వీరందర్నీ సాధారణ శాఖలకు రిపోర్ట్ చేయాలని సీఎస్ ఆదేశించారు.
జగన్ పోస్టింగ్‌లు ఇచ్చింది వీరికే..
పలువుర్ని బదిలీ చేసిన వైఎస్ జగన్ సీఎంవోలో తొలి పోస్టింగ్ ఉత్తర్వును సైతం ఇచ్చారు. టూరిజం శాఖ ఎండీగా పనిచేస్తున్న ధనుంజయ్ రెడ్డిని సీఎం అదనపు కార్యదర్శిగా నియమించారు. కాగా మరికొంత ప్రధాన అధికారులు బదిలీ అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అధికారులు సక్రమంగా ఉంటే పరిపాలన మంచిగా ఉంటుందని.. ప్రభుత్వాలు నిలబడాలన్నా.. కుప్పకూలిపోవాలన్నా నేతలకంటే అధికారులే కీలకమన్న విషయం తెలిసిందే. అందుకే వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం మరుక్షణం నుంచే చంద్రబాబుకు టీమ్‌లోని అధికారులందరికీ వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే మున్ముంథు మరింత మంది ఉన్నతాధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు బదిలీలు జరిగే అవకాశముంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout