మీ ఆశీస్సులు చాలు.... ఇంకా గొప్ప కార్యక్రమాలు చేపడతా : జగన్

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన ఆయన... నేతలన్నకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. గతంలో సబ్సిడీలు రాక నేతన్నలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నా... ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మన చేనేత పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉన్నా.... నేతన్నలను పట్టించుకునే పాలకులు లేకుండా పోయారని అన్నారు జగన్. అగ్గిపెట్టెలో చీర నేయడం నుంచి స్వాంత్ర్యోద్యమం వరకు నేతన్నలకు గొప్ప చరిత్ర ఉందన్నారు.

గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీరం చేసిందని... నేతన్నలకు ఏ కష్టమొచ్చినా మేము ఇక్కడికి వచ్చామని... అప్పటి సర్కార్ చేసిన అన్యాయాలపై నిరాహారదీక్షలు చేశామని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చామని... ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు జగన్. జనవరి 9 నాటికి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతీ తల్లికి రూ. 15 వేలు అందిస్తామన్నారు.

కానీ శత్రువులు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారని అన్న జగన్... మీ ఆశీస్సులు, దేవుడి దయే నాకు బలమన్నారు. ఇంతకన్నా గొప్పగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నానని అన్నారు జగన్.

More News

ఒకేసారి రెండు సినిమాలు.. నాగ చైతన్య ప్లాన్ ఇదే

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాగ చైతన్య రూటే సపరేటు. ఢిఫరెంట్ జానర్స్‌లో వరుస సినిమాలు చేస్తూ..

త్వరలో ఆదిత్య369 సీక్వెల్... డైరెక్టర్ గా బాలయ్య

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరియర్ లో ప్రయోగాత్మకంగా నిలిచిన చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మరో 30 ఏళ్లు కొనసాగాలి : విజయసాయి రెడ్డి

రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని తెలిపారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలనేదే ఆయన ఉద్దేశ్యమన్నారు.

రోడ్డు మీద నడిచినా డబ్బులు వసూల్ చేస్తారా కేసీఆర్.. బంగారు తెలంగాణ అంటే ఇదేనా?: విజయశాంతి

కల్వకుంట్ల కుటుంబం చేసిన దుబారా ఖర్చులకు సామాన్యులు బాధపడాల్సి వస్తోందన్నారు తెలంగాణ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి.

లేటెస్ట్‌ కామెడీ రియాలిటీ షో 'అదిరింది' లాంచ్‌ చేసిన జీ తెలుగు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ జీ తెలుగు. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది జీ తెలుగు.