కరోనా నేపథ్యంలో వాలంటీర్లకు వైఎస్ జగన్ స్పెషల్ గిఫ్ట్

యావత్ ఇండియా వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మొదట ఈ వ్యవస్థపై ప్రతిపక్షాలు తిట్టిపోసినా.. ఆ తర్వాతే వారే మెచ్చుకున్నారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలు ఈ వాలంటీర్ వ్యవస్థను ఆదర్శంగా తీసుకుని అక్కడ అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయంటే జగన్ సర్కార్ ముందుచూపేంటో ఇట్టే తెలుసుకోవచ్చు. కరోనా కష్టకాలంలోనూ వాలంటీర్లు తమ విధులు నిర్వహిస్తూ ప్రభుత్వం మన్ననలు పొందుతున్నారు.

కీలక పాత్ర..

కరోనా పోరులో డాక్టర్, పోలీసులు, మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు సాయశక్తులా పోరాడుతున్నారు. ఇక ఏపీలో అయితే గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటి సర్వే అని.. టెస్ట్‌లకు మెడికల్, ఆశా వర్కర్లకు సహకరించడం ఇలా నిత్యం ప్రజల్లోనే ఉండిపోతున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా సర్వే పూర్తి చేసి.. మూడో సర్వేకు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా ఇళ్లలో నుంచి జనాలను బయటికి రానివ్వకుండా.. ఆ గ్రామం నుంచి బయటికి పోనివ్వకుండా.. ఇతర గ్రామస్థులను ఇక్కడికి రానివ్వకుండా కూడా వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలను తెలుసుకుని వెంటనే వారికి పరీక్షలు చేయించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కరోనా కష్టకాలంలో వాలంటీర్ వ్యవస్థ అనేదే లేకుంటే జగన్ సర్కార్ చాలా ఇబ్బందులే పడేదని చెప్పుకోవచ్చు.

50 లక్షల బీమా..

ఇన్నె్న్ని విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లు కూడా వైరస్ బారీన పడే ప్రమాదం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలో వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. వాలంటీర్లను ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కిందకు తీసుకొచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం సర్కులర్‌ను కూడా విడుదల చేసింది. జగన్ ఆదేశాలతో పంచాయితీ రాజ్ శాఖకు వైద్య, ఆరోగ్య శాఖ ఈ సర్క్యులర్ జారీ చేసింది. ఈ పథకం కింద గ్రామ, వార్డు వాలంటీర్లకు రూ.50 లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది. రాష్ట్రంలో ఉన్న 2,60,000 మంది గ్రామ, వార్డు వాలంటీర్లకు ఈ కరోనా బీమా వర్తించనుంది. నిజంగా ఇది ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయమే అని చెప్పుకోవచ్చు.

More News

సూర్యాపేట జిల్లాలో భారీగా పెరిగిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే అనుకుంటే ఇప్పుడు జిల్లాలకూ పెద్ద ఎత్తున వ్యాపించింది. మరీ ముఖ్యంగా

కరోనా కష్టకాలంలో శుభవార్త చెప్పిన వాట్సాప్

అవును మీరు వింటున్నది నిజమే.. అసలు కరోనాకు.. వాట్సాప్‌కు ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా..? ఎలాంటి సంబంధం లేదు కానీ.. ఈ టైమ్‌లో ఏం జరిగినా..

హైదరాబాద్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి హైదరాబాద్ నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో

కలకలం.. ప్రముఖ టీవీ ఛానెల్‌లో 26 మందికి కరోనా

కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న మీడియా మిత్రులను కూడా కరోనా కాటేస్తోంది. ఇప్పటికే ముంబైలోని 56 మంది జర్నలిస్టులకు కరోనా

ఏపీలో 757కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 757కు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఇవాళ ఇద్దరు మృతి చెందారు.