జగన్ సారూ.. అర్జెంట్‌గా వీటి సంగతేంటో తేల్చండి!
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఎన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారో..? రాష్ట్రంలోని అన్ని వర్గాలకు ఎలాంటి శుభవార్తలు చెబుతున్నారో అందరికీ తెలిసిందే. అయితే అన్ని చేస్తున్న జగన్.. వైసీపీ వర్సెస్ టీడీపీ కార్యకర్తలు, వర్గీయుల దాడుల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదో అర్థం కాని పరిస్థితి.
ఎన్నికల సీజన్ మొదలుకుని ఇప్పటి వరకూ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ.. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వాళ్లు పెద్ద ఎత్తునే దాడి చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో కొందరు ప్రాణాలు సైతం విడిచారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న టీడీపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇప్పటికీ ఫిర్యాదుల పర్వం మాత్రం ఆగలేదు. రాష్ట్రంలో రోజుకోచోట అయినా వైసీపీ వర్సెస్ టీడీపీ వర్గీయులు గొడవ పడుతూనే ఉన్నారు.. కేసులు, కోర్టులు అంటూ తిరుగుతూనే ఉన్నారు. వాస్తవానికి టీడీపీ హయాంలో వైసీపీ కార్యకర్తలు కూడా దెబ్బలు తిన్నారు.. అయితే ఇప్పుడు రివెంజ్‌లు తీర్చుకోవడం ఎంత వరకు సమంజసం.
వైసీపీ వర్గీయులదే పై చేయి అయ్యిందని.. వారు చెప్పినట్లే పోలీసులు సైతం వింటున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా వైఎస్ జగన్ మాత్రం ఈ వ్యవహారంపై ఒక్కసారి కూడా స్పందించకపోవడం గమనార్హం. ఇలాంటి దాడులకు పాల్పడటం సమంజసమేనా..? ఇలా దాడులు చేసుకుంటూ పోతే ఎవరైనా మిగులుతారా..? అసలు ఈ దాడులపై సీరియస్‌గా తీసుకుని కార్యకర్తలు, నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి.. తాట తీస్తానని చెప్పాల్సిన జగన్ ఇలా ఎందుకు మిన్నకుండిపోతున్నారని సొంత పార్టీ నేతలే అసంతృప్తికి లోనవుతున్నారట.
ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని.. ఆరోపణలు, దాడులు చేసినట్లు నిజం అని తేలితే శిక్షలు గట్టిగానే ఉంటాయని వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కార్యకర్తలు కొందరు చేసే ఇలాంటి చిల్లర దాడులతో ప్రభుత్వానికి మాయని మచ్చ వచ్చి పడుతుందని.. జగన్ సారూ అర్జెంట్‌గా ఈ దాడుల సంగతేంటో తేల్చేయండి అని కొందరు వీరాభిమానులు సైతం ఆయన దృష్టికి తీసుకెళ్లారట. అయితే ఈ వ్యవహారంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout