తిరుమలలో అన్యమత ప్రచారం.. వైఎస్ జీవో చూడు జగన్!
Send us your feedback to audioarticles@vaarta.com
తిరుమల ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీన్నే సువర్ణావకాశంగా తీసుకున్న టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీ సర్కార్‌పై లేనిపోని అబంఢాలు మోపాయి. అయితే తీరా చూస్తే.. ఆర్టీసీ టికెట్లు గత ప్రభుత్వం హయాంలో ముద్రించినట్లు ఉండటంతో అసలు వ్యవహారం బట్టబయలు అయ్యింది. అన్యమతమని ప్రచారం జరగడంతో ఈ వ్యవహారంపై విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి రియాక్ట్ అయ్యారు.
ఉపేక్షించం!
బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేయడం దుర్మార్గపు చర్య అని తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కుట్రకు బాధ్యులెవరో తేల్చి కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా పీఠాధిపతి డిమాండ్ చేశారు. అంతేకాదు.. ఈ వ్యవహారాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని.. హిందూ దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఓ జీవోను జారీ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ జీవోను సీఎం జగన్ తక్షణమే సమీక్షించాలని ఆయన కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎలాంటి ఘటనలు జరిగినా ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.
దేవాదాయశాఖ మంత్రి స్పందన
ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బ తీసేందుకు ప్రతిపక్షం కుట్ర చేస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమల బస్ టికెట్ల అన్యమత ప్రచారం ప్రభుత్వ దృష్టికి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఆ టికెట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముద్రించినట్లు తేలిందన్నారు. నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు తిరుపతి డిపోకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారన్నారు. ఈ వ్యవహారంపై విచారణే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. ఉద్దేశ పూర్వకంగా శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనేదే ప్రతిపక్షం కుట్ర అన్నారు. విష ప్రచారానికి పాల్పడుతున్న మీడియా సంస్థలు, వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments