బాలయ్య వియ్యంకుడికి షాకిచ్చిన వైఎస్ జగన్!

  • IndiaGlitz, [Wednesday,October 30 2019]

ఇదేంటి బాలయ్య పేరు ఎందుకొచ్చింది..? అసలు ఈ షాకులేంటి..? ఆయనెవరికో షాకిస్తే బాలయ్యకు ఏంటి సంబంధం అని మీరు అనుకుంటున్నారు కదూ..? అదేం కాదండోయ్.. నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు, నారా చంద్రబాబు సమీప బంధువు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామంలో ఎకరా కేవలం నామమాత్రపు ధర రూ. లక్షకు 498.93 ఎకరాలను గత ప్రభుత్వం కేటాయించింది. అయితే ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేస్తూ.. గత ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు చేసిన భూకేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియా ద్వారా వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో భూములు ఇవ్వడమే కాకుండా.. ఆ భూమిని సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకువస్తూ అప్పట్లో బాబు జీఓను సైతం జారీ చేసిన విషయాన్ని మంత్రి బయటపెట్టారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాల్లో అత్యంత అనైతికంగా భావిస్తూ.. ఆ భూ కేటాయింపులను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో బాలయ్యకే కాదు.. ఆయన వియ్యంకుడు, చంద్రబాబు కూడా ముక్కున వేలేసుకున్నారట. అయితే ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. విశాఖపట్నం బీచ్‌ రోడ్డులో మార్కెట్‌లో ఎకరా రూ. 50 కోట్లు ధర పలికే అత్యంత విలువైన 13 ఎకరాల 83 సెంట్ల భూమిని హీనాతి హీనంగా ఎకరా రూ. 4 లక్షలకు లూలూ అనే సంస్థకు చంద్రబాబు కట్టబెట్టారని మంత్రి నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల ఆస్తిని కొల్లగొట్టే రీతిలో ఉన్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ కేబినెట్‌లో తీర్మానించడం జరిగిందని పేర్ని నాని మీడియా మీట్‌లో స్పష్టంగా వివరించారు.

More News

రామ్ `రెడ్` రిలీజ్ డేట్ ఫిక్స్‌

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం `రెడ్‌` నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

రాజకీయాల‌కే తొలి ప్రాధాన్య‌త‌ : విజ‌య‌శాంతి

``రాజకీయాల‌నేవి పూర్తి అంకిత భావంతో చేయాలి. కాబ‌ట్టి ప్ర‌స్తుతం నా ప్రాధాన్య‌త ముందు రాజ‌కీయాల‌కే`` అని అంటున్నారు

4గంటల పాటు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు

ఒకట్రెండు కాదు సుమారు నాలుగు గంటలపాటు సాగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది.

మోదీ సంచలన నిర్ణయం.. బంగారం లెక్కలు చెప్పాల్సిందే!

దేశంలో నల్లధనం నిర్మూలనకు మూడేళ్ల క్రితం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..

రాజ్‌నాథ్‌తో కేటీఆర్ భేటీ.. భూముల అప్పగింతపై చర్చ

తెలంగాణ మంత్రి కేటీఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు.