తొలి రోజే కొత్త మంత్రులకు జగన్ షాకింగ్ న్యూస్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా మొత్తం 43 అంశాలపై లోతుగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పనిలో పనిగా ఇదే భేటీలోనే కొత్త మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి షాకింగ్ న్యూస్ చెప్పారు. అయితే ఆ షాకింగ్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఏ క్షణమైనా సరే..!
"నా ప్రభుత్వంలో మంత్రులు డమ్మీలు కారు. ఏ మంత్రిపై అయినా అవినీతి ఆరోపణలు వస్తే తక్షణమే తొలగించేస్తాను. మంత్రి పదవికి రెండున్నరేళ్లు గ్యారెంటీ ఉండదు.. అవినీతి మరక అంటితే ఏ క్షణమైనా తొలగించేందుకు నిర్ణయం తీసుకుంటాను. మంత్రులందరూ తమ తమ శాఖల్లో గత ఐదేళ్లలో జరిగిన తప్పులు, అవినీతి ఎక్కడ జరిగిందో పరిశీలించాలి. అన్నింటిలో ప్రక్షాళన చేయాల్సిన గురుతర బాధ్యత అందరిపై ఉంది. మరీ ముఖ్యంగా.. జూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని న్యాయమూర్తిని కోరాం. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. జూడిషయల్ కమిషన్ ఏ శాఖల్లో కాంట్రాక్టులు, టెండర్లు..ఇలా ప్రతిది కూడా అందజేయాలని తీర్మానించాం. ఎవరైనా సరే ఈ టెండర్లు చూసుకునేలా ఏర్పాటు చేస్తున్నాం. అన్నింటింటి పరిశీలించి తప్పులు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని జూడిషియల్ కమిషన్ ప్రభుత్వానికి సూచిస్తే.. ఆ సూచనలు పాటిస్తాం" అని కొత్త మంత్రులకు వైఎస్ జగన్ తేల్చిచెప్పారు.
మేం రె‘ఢీ’..!
సీఎం ఈ మాటలు అనడంతో మంత్రులు కచ్చితంగా మీకు సహకరించి ప్రజలకు ‘దటీజ్ జగన్ గవర్నమెంట్ ’ అని అనిపిస్తామని ఆ 25 మంది మాటిచ్చారట. అయితే ఈ మాటను మంత్రులు ఏ మాత్రం నిలబెట్టుకుంటారో.. వైఎస్ జగన్‌కు ఏ మాత్రం సహకరించి ఎంత మాత్రం సుపరిపాలన దిశగా అడుగులేస్తారో మరికొన్ని రోజుల వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout