‘వైఎస్’ను గుర్తు చేస్తాడనుకుంటే జగన్ మాత్రం..!
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనను గుర్తు చేస్తాడనుకుంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లా వెళ్తున్నారు’ అని జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. అంటే ఇందులో పొగడ్త ఉందా..? విమర్శ ఉందా..? అనేది ఈ మాటలు అన్నవారికే తెలియాలి మరి.
పులివెందుల కార్యకర్తలు ఏమన్నారు..!?
గురువారం నాడు మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ పైన చెప్పిన వ్యాఖ్యలు తన నోటితో వెల్లడించారు. ‘151 సీట్లు గెలిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వైఎస్ జగన్. రాష్ట్రంలో అద్భుతమైన పాలన కొనసాగుతోంది. నేను పదిరోజుల క్రితం రెండో బ్లాక్ వద్ద ఉంటే పులివెందులకు సంబంధించిన కార్యకర్తలు నన్ను కలిసారు. మా జగన్ ఏంటి కేజ్రీవాల్‌లా ముందుకెళ్తున్నారు.. అని నన్ను అడిగారు’ అని ఆమంచి చెప్పుకొచ్చారు.
హత్యాయత్నంతో సంబంధం లేదు!
చీరాలలో సామాజిక కార్యకర్త నాగార్జున రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా ఆమంచి స్పందిస్తూ.. తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అంతటితో ఆగని ఆయన.. నాగార్జున రెడ్డి అసలు జర్నలిస్టే కాదని.. గతంలో టీడీపీ ఏజెంట్‌గా పనిచేశారన్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రమాణం రోజు నుంచి అన్నీ సంచలనాలే!
ఇదిలా ఉంటే.. మే 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి వైఎస్ జగన్ పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అడగడుగునా కేంద్ర ప్రభుత్వం బ్రేక్‌లు వేస్తున్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరి ముందుకెళ్తూ జగన్ సక్సెస్ అవుతూ వచ్చారు. ముఖ్యంగా పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల వ్యవహారంలో జగన్‌పై కేంద్ర ప్రభుత్వం కన్నెర్రజేసింది. అయితే జగన్ మాత్రం ధైర్యంగా ముందుకెళ్లి ఈ రెండు విషయాల్లోనూ గ్రాండ్ సక్సెస్ అయ్యారు. దీంతో యావత్ దేశం మొత్తం వైఎస్ జగన్ వైపు చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ, బీజేపీ నేతలు సైతం మీడియా ముందుకొచ్చి జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటే ఆయన పరిపాలన ఎలా ఉందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments