‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం’పై జగన్ సవరణ!
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి కీలక, సంచలన నిర్ణయాలతో ప్రభుత్వాన్ని సాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాజాగా ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం’ అంటూ మరో నిర్ణయమే తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంటే 2020 నుంచి 01-08 తరగతులకు గాను తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయనున్నట్లు ఓ సంచలన ప్రకటన చేసింది. అయితే దీనిపై ఇటు ప్రతిపక్షాల నుంచి.. అటు ప్రజా సంఘాలు, భాషాభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని అయితే మార్చుకోలేదు కానీ చిన్నపాటి సవరణ చేశారంతే.!
ల్యాబ్స్ ఏర్పాటు చేయండి!
శనివారం నాడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సుధీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, సంబంధిత అధికారులకు జగన్ పలు కీలక ఆదేశాలు, సలహాలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ‘నాడు – నేడు’లో భాగంగానే ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని, బోధనలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని ఆదేశించారు.
సవరణ ఇదీ..!
ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో 01 తరగతి నుంచి 08 వరకు ఇంగ్లీష్ బోధన అని ఉంది. అయితే ప్రతిపక్షాల విమర్శలు వస్తుండటం.. తెలుగు భాషను చంపేస్తారా..? కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండటంతో చిన్నపాటి సవరణ చేసిన జగన్ రెండు తరగతులు వెనక్కి తగ్గించి 01 నుంచి 06 తరగతుల వరకే ఇంగ్లీష్ బోధన అంటూ ప్రకటించారు. అంటే నిర్ణయం మాత్రం సేమ్.. తరగతులే రెండు తగ్గాయంతేనన్న మాట. దీనిపై తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యా శాఖ అధికారులను జగన్ ఆదేశించారు. కాగా.. ఈ ఇంగ్లీష్ బోధనకై ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని.. అంతేకాకుండా హ్యాండ్‌బుక్ రూపొందించాలని అధికారులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సూచించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments