‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం’పై జగన్ సవరణ!

  • IndiaGlitz, [Saturday,November 09 2019]

సీఎంగా ప్రమాణం చేసిన నాటి నుంచి కీలక, సంచలన నిర్ణయాలతో ప్రభుత్వాన్ని సాగిస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తాజాగా ‘ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లం’ అంటూ మరో నిర్ణయమే తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి అంటే 2020 నుంచి 01-08 తరగతులకు గాను తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయనున్నట్లు ఓ సంచలన ప్రకటన చేసింది. అయితే దీనిపై ఇటు ప్రతిపక్షాల నుంచి.. అటు ప్రజా సంఘాలు, భాషాభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వైఎస్ జగన్ తన నిర్ణయాన్ని అయితే మార్చుకోలేదు కానీ చిన్నపాటి సవరణ చేశారంతే.!

ల్యాబ్స్ ఏర్పాటు చేయండి!

శనివారం నాడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సుధీర్ఘంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, సంబంధిత అధికారులకు జగన్ పలు కీలక ఆదేశాలు, సలహాలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ‘నాడు – నేడు’లో భాగంగానే ఇంగ్లిష్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలని, బోధనలో సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విధానాలను పాటించాలని ఆదేశించారు.

సవరణ ఇదీ..!

ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వుల్లో 01 తరగతి నుంచి 08 వరకు ఇంగ్లీష్ బోధన అని ఉంది. అయితే ప్రతిపక్షాల విమర్శలు వస్తుండటం.. తెలుగు భాషను చంపేస్తారా..? కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండటంతో చిన్నపాటి సవరణ చేసిన జగన్ రెండు తరగతులు వెనక్కి తగ్గించి 01 నుంచి 06 తరగతుల వరకే ఇంగ్లీష్ బోధన అంటూ ప్రకటించారు. అంటే నిర్ణయం మాత్రం సేమ్.. తరగతులే రెండు తగ్గాయంతేనన్న మాట. దీనిపై తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యా శాఖ అధికారులను జగన్ ఆదేశించారు. కాగా.. ఈ ఇంగ్లీష్ బోధనకై ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇవ్వాలని.. అంతేకాకుండా హ్యాండ్‌బుక్ రూపొందించాలని అధికారులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సూచించారు.

More News

లిడో డాన్సర్స్ తో ఫస్ట్ సౌత్ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్

అల వైకుంఠపురంలో   సామాజవరగమన సాంగ్ షూట్ కి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే. పారిస్ లో లియో డాన్సర్స్ తో

'పింక్' కి పవన్ కళ్యాణ్ యాత్ర దెబ్బ?

జ‌న‌సేన‌నాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే.

సగానికి తగ్గించుకున్న బోయపాటి రెమ్యూనరేషన్

మాస్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకుని అగ్ర హీరోల‌తో యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమాల‌ను తెర‌కెక్కించిన దర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.

మహేష్ మూవీకి స్పెష‌ల్ సాంగ్స్‌ను సిద్ధం చేసిన దేవిశ్రీ

సాధార‌ణంగా ఇప్ప‌టి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అనైనా అనండి.. స్పెష‌ల్ సాంగ్స్ అనైనా అనండి.. ఓ సాంగ్ కామ‌న్‌గా ఉంటూ వ‌స్తుంది.

అయోధ్య తీర్పుపై జనసేనాని స్పందన ఇదీ...

భారతదేశంలో అతిపెద్ద, దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కీలక అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే.