సీఎం జగన్ ముందుచూపుతో యద్ధప్రాతిపదికన సహాయచర్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
తీర ప్రాంతమైన రాష్ట్రం కావడంతో ఏపీలో తుఫాన్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభిస్తాయో తెలియదు. కానీ ఎటువంటి విపత్తులు తలెత్తినా ఎదుర్కోవడానికి సరైన పాలకుడు అవసరం. ఇప్పుడు అలాంటి నాయకుడే రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. తుఫాన్ ప్రభావం నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి జగన్ 8 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. అత్యవసర సహాయక చర్యల కోసం రూ.11 కోట్లు విడుదల చేశారు. గతంలో వరద బాధితులు సాయం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు.
తక్షణ సాయం అందించేలా చర్యలు..
కానీ జగన్ పాలనలో వర్ష ప్రభావం ఎక్కువగా నెల్లూరు జిల్లాకు 2 కోట్లు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు రూ.కోటి చొప్పున వినియోగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతోపాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది.
కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు..
అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో నష్టాన్ని క్షణాల్లో అంచనా వేసి ప్రభుత్వం బాధితులకు సహాయం అందించింది. వరికోతల సమయంలో తుఫాన్ కారణంగా పంట దెబ్బ తిన్న రైతన్నలకు వెన్నుదన్నుగా నిలిచింది. కలెక్టర్లతో సమావేశమైన సీఎం జగన్ ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. తేమ శాతంతో సంబందం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోలు చేయాలని తక్షణ ఆదేశాలు జారీ చేయడంతో అన్నదాలలు ఊపిరి పీల్చుకున్నారు.
బాధితులకు రూ.10వేలు పరిహారం..
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎప్పటికప్పుడూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బాధితులకు సహాయక చర్యలు అందించడంలో సీఎం జగన్ విజయవంతమయ్యారు. భారీ వర్షాల కారణంగా బాధితులకు గంటల వ్యవధిలోనే పరిహారం అందించి అండగా నిలిచారు. ఇళ్లు, గుడిసెలు దెబ్బతింటే రూ.10 వేలు ఆర్థిక సాయం.. వరద బాధితుల కటుంబానికి రూ.1000ల నుంచి రూ.2500 సహాయంక అందేలా చర్యలు తీసుకున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కేజీ చొప్పున అందించే ఏర్పాట్లు చేశారు. సీఎం ముందుచూపుతో తమకు తక్షణ సహాయం అందిందని బాధితులు చెబుతుండటం ఆయన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments