వైసీపీ మూడో జాబితాలో బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబూలం
Send us your feedback to audioarticles@vaarta.com
సామాజిక న్యాయమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్న సీఎం జగన్.. అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలతో ఎంతో మేలు చేస్తున్నారు. అలాగే పదవుల్లో కూడా వారికే పెద్ద పీట వేస్తున్నారు. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ మాటల్లో చెప్పడం కాదు.. చేతల్లో చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల కసరత్తు చేస్తున్న పార్టీ అధినేత జగన్.. తాజాగా 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది.
11 అసెంబ్లీ స్థానాలు కేటాయింపు..
ఈ జాబితాను పరిశీలిస్తే సామాజిక న్యాయం స్పష్టంగా కనిపిస్తోంది. 15 అసెంబ్లీ స్థానాల్లో 11 స్థానాలను బీసీలు, ఎస్సీ, మెనార్టీలకు కేటాయించింది. మిగిలిన నాలుగు స్థానాల్లో ఓసీలకు చోటు ఇచ్చింది. ముందుగా చెబుతున్నట్లు బడుగు, బలహీన వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చింది. పెనమలూరు నుంచి మంత్రి జోగి రమేశ్, పెడన నుంచి ఉప్పాల రాము, ఆలూరు నుంచి విరూపాక్షి, ఇచ్ఛాపురం నుంచి పిరియా విజయ, టెక్కలి నుంచి దువ్వాడ శ్రీనివాస్.. బీసీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ఇక పూతలపట్టు నుంచి సునీల్‌కుమార్, చింతలపూడి నుంచి విజయరాజు, కోడుమూరు నుంచి డాక్టర్. సతీశ్, సత్యవేడు నుంచి గురుమూర్తి, గూడూరు నుంచి మేరిగ మురళి.. ఎస్సీ అభ్యర్థులుగా ఉన్నారు. మదనపల్లె నుంచి నిస్సార్ అహ్మద్.. మైనార్టీ అభ్యర్థిగా స్థానం దక్కించుకున్నారు.
బీసీలకు 4 ఎంపీ స్థానాలు..
ఇక 6 ఎంపీ స్థానాల్లో 4 స్థానాలనూ బీసీలకు ఇవ్వడం జరిగింది. మిగిలిన రెండు స్థానాల్లో ఓసీ, ఎస్సీలకు కేటాయించారు. వీరిలో శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పేడాడ తిలక్, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ స్థానానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్, కర్నూలు ఎంపీ స్థానానికి మంత్రి గుమ్మనూరి జయరాం.. బీసీ అభ్యర్థులుగా ఉన్నారు. ఓసీ అభ్యర్థిగా కమ్మ సామాజికవర్గానికి చెందిన కేశినేని నానికి విజయవాడ ఎంపీ స్థానానికి ఎంపిక చేశారు. తిరుపతి ఎంపీ స్థానం నుంచి ఎస్సీ వర్గానికి చెందిన కోనేటి ఆదిమూలంకు అవకాశం కల్పించారు. మొత్తంగా చూసుకుంటే 21 మందితో కూడిన మూడో జాబితాలో సామాజిక న్యాయం పాటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments