జగన్ సొంత జిల్లాలో అభ్యర్థులు ఫిక్స్

  • IndiaGlitz, [Friday,March 01 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌ సొంత జిల్లా, పార్టీ కంచుకోటగా పేరుగాంచిన కడప జిల్లాలో అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారైపోయింది. ఇప్పటికే పలుమార్లు జనాల్లో మంచిపేరు సంపాదించుకున్న, ప్రజల కష్టాలను తీర్చిన వారికే టికెట్ ఇస్తామని.. ముఖ్యంగా అలాంటి వారిలో సిట్టింగ్‌‌లు మళ్లీ టికెట్లు ఇస్తానని జగన్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారికి ఎవరికి ఎక్కడ అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. కాగా ఈ అభ్యర్థుల్లో దాదాపు అందరూ సిట్టింగ్‌‌లే కావడం గమనార్హం. అభ్యర్థుల జాబితా ఫిక్స్ అయినప్పటికీ ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి రోజే బస్సు యాత్రలో భాగంగా అభ్యర్థుల జాబితాను జగన్ విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

నియోజకవర్గాల సంఖ్య : 10
పార్లమెంట్ స్థానాలు : 02

అసెంబ్లీ నియోజకవర్గాలు..
1. పులివెందుల: వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డి
2. కడప: అంజద్‌బాష
3. మైదుకూరు : ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
4. కమలాపురం : రవీంద్రనాథరెడ్డి
5. రాయచోటి : గడికోట శ్రీకాంత్‌రెడ్డి
6. రాజంపేట : మేడా మల్లిఖార్జున రెడ్డి
07. రైల్వేకోడూరు: కొరముట్ల శ్రీనివాసులు
08. ప్రొద్దుటూరు : రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
09. జమ్మలమడుగు : మూలె సుధీర్‌రెడ్డి
10. బద్వేలు : డాక్టర్‌ వెంకటసుబ్బయ్య

పార్లమెంట్ స్థానాలు..
01. కడప : వైఎస్ అవినాశ్ రెడ్డి
02. రాజంపేట: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి

కాగా వీరిలో ఏడు మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. గత ఎన్నికల్లో జిల్లా మొత్తమ్మీద రాజంపేట ఒక్కటే టీడీపీ కైవసం చేసుకుంది. అయితే ఆయన టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ తీర్థం పుచ్చుకోగా మళ్లీ పార్టీ తరఫున టికెట్ ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారు. 2014లో పోటీచేసిన జగన్ ఆప్తుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లో వైసీపీ బీఫామ్ మీద గెలిచిన ఆదినారాయణ రెడ్డి, జయరాములు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత ఆది మంత్రి పదవిని పొందారు కానీ ఈ ఎన్నికల్లో మాత్రం టికెట్ తెచ్చుకోలేకపోయారు. ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు.. ఇప్పటికే రామసుబ్బారెడ్డికి టికెట్ ఫిక్స్ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తేల్చేయగా.. ఆదికి.. కడప ఎంపీ, ఆయన తమ్ముడికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. వైసీపీ అధినేత మొదలుకుని అందరు అభ్యర్థులకు చెక్ పెట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపిక చాలా ఆచితూచి చంద్రన్న అడుగులేస్తున్నారు.

అయితే పైన చెప్పిన వైసీపీ అభ్యర్థులు దాదాపు ఖాయమనే పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ప్రత్యర్థులను బట్టి ఒకరిద్దర్ని వైసీపీ అధినేత మార్చే అవకాళం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 09 ఎమ్మెల్యేలు, రెండు అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.. అయితే 2019 ఎన్నికల్లో పరిస్థితులు తారుమారవుతాయా..? లేకుంటే క్లీన్ స్వీప్ అవుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.

More News

ఉచిత విద్య, వైద్యం, ప్రయాణమే జనసేన లక్ష్యం

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే విద్యార్ధుల‌కి ఉచిత ప్ర‌యాణ సౌక‌ర్యం, ఉచిత క్యాంటిన్లు అందుబాటులోకి తెస్తామ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు.

దర్శకుడు సురేశ్ కృష్ణకు అరుదైన పురస్కారం

తమిళ సర్కార్ ప్రతిష్టాత్మకంగా 1968 నుంచి ‘కళైమామణి’ పురస్కారాలు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

నేను ముఖ్యమంత్రి అయితే.... పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌కు తాను ముఖ్య‌మంత్రి అయితే ల‌క్ష ఉద్యోగాలు ఇచ్చే బాధ్య‌త తీసుకుంటాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు.

ఇద్ద‌రు హీరోయిన్స్‌తో తలైవా

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ త‌దుప‌రి సినిమాకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ చేయ‌బోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

లివ్ ఇన్ కోసం ప‌ర్మిష‌న్ కావాల‌ట‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న వ‌న్ నేనొక్క‌డినే చిత్రంలో న‌టించిన బాలీవుడ్ బ్యూటీ కృతిస‌న‌న్‌..