పృథ్వీకి వై.ఎస్‌.జ‌గ‌న్ స‌పోర్ట్‌

  • IndiaGlitz, [Tuesday,July 17 2018]

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇక్క‌డ అంటూ త‌న‌దైన కామెడీతో మెప్పించిన పృథ్వీ క‌మెడియ‌న్‌గా ఫుల్ బిజీగా రాణిస్తున్నారు. అదే త‌రుణంలో రాజ‌కీయాల ప‌రంగా త‌న స‌పోర్ట్‌ను వై.ఎస్‌.జ‌గ‌న్‌కి ప్ర‌క‌టించారు. మ‌రో అడుగు ముందుకేసి పృథ్వీ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న 'మై డియర్ మార్తాండం' సినిమా టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌మ‌ని వై.ఎస్‌.జ‌గ‌న్‌ని కోరార‌ట‌.

వై.ఎస్‌.జ‌గ‌న్ స‌రేన‌న్నార‌ట‌. ముప్పై రోజుల్లో లాయ‌ర్ కావ‌డం ఎలా? పుస్త‌కాన్ని చ‌దివి డిఫెన్స్ లాయ‌ర్ అయిన పృథ్వీ పాత్ర నుండి వ‌చ్చే క్రైమ్ కామెడీ క‌థే 'మై డియ‌ర్ మార్తాండం'. మ‌జిన్ మూవీ మేక‌ర్స్‌పై కె.వి.హ‌రీశ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.