వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్.. రాజ్యసభకు చిరు!!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇదేంటి.. టైటిల్ చూడగానే షాకయ్యారు కదూ.. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయ్. జనసేనాధిపతి పవన్ కల్యాణ్ బ్రేక్‌లేసి.. ఇండస్ట్రీని హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీని విశాఖకు తరలించాలని వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్ వేశారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది. అసలు ఇందులో నిజమెంత ఉంది..? రాజకీయాలకు ఇక వద్దు బాబోయ్ అని గుడ్ బై చెప్పేసి సినిమాలు చేసుకుంటున్న చిరు నిజంగానే రీ ఎంట్రీ ఇస్తారా..? అనే విషయాలు www.indiaglitz.com ఎక్స్ క్లూజివ్ కథనంలో తెలుసుకుందాం.
తరలిస్తే.. ఢిల్లీకి!
ఎవరూ కలలో కూడా ఊహించని రీతిలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు దక్కించుకుని ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆయన గెలుస్తారని ఊహించారు కానీ ఈ రేంజ్‌లో అసెంబ్లీ సీట్లు వస్తాయని మాత్రం ఎవరూ అనుకోలేదు. ఆయన గెలిచిన అనంతరం అన్ని రంగాలకు చెందిన వారు జగన్‌ను కలిసి విషెస్ చేయడం జరిగింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఒకరిద్దరూ సినిమా కమ్ రాజకీయ నేతలు తప్ప పెద్దలెవరూ జగన్ కంపౌండ్‌కు వెళ్లలేదు.
అయితే ప్రత్యేక రాష్ట్రం.. నవ్యాంధ్రకు మూడు రాజధానులు దాదాపుగా ప్రకటించబోతున్న తరుణంలో ఇండస్ట్రీ కూడా విశాఖ లేదా విజయవాడకు తరలివస్తే బాగుంటుందని.. ఆ తరలింపు బాధ్యతలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన చిరంజీవికి జగన్ అప్పగించారని తెలుస్తోంది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు జగన్‌తో భేటీ అయిన చిరంజీవి.. ఇదే విషయమై కీలకంగా చర్చించారని తాజాగా వెలుగుచూసింది. అయితే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే చిరుకు బంపరాఫర్ ఇవ్వవాలని జగన్ భావిస్తున్నారట. మెగాస్టార్‌ను పెద్దలసభ (రాజ్యసభ)కు పంపాలని సీఎం అనుకుంటున్నారట.
పవన్‌కు ఊహించని షాకే..!
అయితే ఈ వార్త నిజమైతే పవన్ కల్యాణ్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ సొంతింట్లో తగులుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ పార్టీ పెట్టినప్పట్నుంచి ఇంతవరకూ ఇద్దరి రాజకీయంగా కలిసిందీ లేదు.. కనీసం 2019 ఎన్నికల హోరాహోరీలోనూ కనీసం పవన్‌కు మద్దతివ్వండని మెగాభిమానులకు చిరు పిలుపు కూడా ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో చిరును జగన్ రాజ్యసభకు పంపితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఊహించుకోనక్కర్లేదు.
రెండూ ఒకేసారి..!
చిరుకు పదవి ఇవ్వడం వల్ల పవన్ స్పీడ్ బ్రేక్‌లు వేయడంతో పాటు ఓ సామాజిక వర్గానికి మరింత దగ్గరవ్వచ్చని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇదే వర్కవుట్ అయితే పవన్‌కు షాక్.. ఇండస్ట్రీ తరలింపు.. అన్నీ ఒకేసారి జరిగిపోతాయన్న మాట. గత రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన పుకార్లు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే వైసీపీ నేతలు లేదా మెగాస్టార్ స్పందించాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com