చిరు విషయంలో జగన్ మాస్టర్ ప్లాన్ నిజమే..!

జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ బ్రేక్‌లు వేయడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారని www.indiaglitz.com ఇదివరకే ‘వైఎస్ జగన్ మాస్టర్ ప్లాన్.. రాజ్యసభకు చిరు!!’ అనే టైటిల్‌తో ఎక్స్ క్లూజివ్‌గా కథనాన్ని రాసింది. అయితే ఈ కథనం అక్షరాలా నిజమయ్యే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయని తాజాగా మంత్రి బొత్సా సత్యనారయణ నోరుమెదపకపోవడంతో తేలిపోయింది. ఇంతకీ జగన్ మాస్టర్ ప్లానేంటి..? బొత్స ఏమన్నాడు..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గతంలో కథనాలు ఇవీ!
మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపాలని.. ఇలా చేయడం వల్ల పవన్ స్పీడ్ బ్రేక్‌లు వేయడంతో పాటు ఓ సామాజిక వర్గానికి మరింత దగ్గరవ్వచ్చని జగన్ మాస్టర్ ప్లాన్ వేశారని గతంలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయ్. ఇదే వర్కవుట్ అయితే పవన్‌కు షాకే. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీని కూడా హైదరాబాద్ నుంచి విశాఖ లేదా విజయవాడకు తరలించాలని కూడా జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. దీనికి మెగాస్టార్ చిరు పెద్ద దిక్కుగా వ్యవహరించాలని జగన్ చెప్పారట. ఇదే జరిగితే.. అటు తరలింపు.. ఇటు చిరును రాజ్యసభకు పంపడం అన్నీ ఒకేసారి జరిగిపోతాయన్న మాట. గత కొన్నిరోజులుగా ఇందుకు సంబంధించిన పుకార్లు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇంత జరుగుతున్నా మెగస్టార్ మాత్రం రియాక్ట్ అవ్వలేదు.

బొత్స మౌనం వెనుక!?
‘చిరంజీవికి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నారా అని అడగగా.. ’ అని మీడియా ప్రతినిధులు మంత్రి బొత్సను ప్రశ్నించగా.. ఆయన సూటిగా బదులివ్వలేదు.. అంతేకాదు ఈ విషయమై మాట్లాడటానికి ఆయన సాహసించలేదు. అంటే మౌనానికి అర్థం అంగీకారమేనా.!. చిరును రాజ్యసభకు పంపడం పక్కా అని తాజా పరిణామంతో తేలిపోయిందన్న మాట. మరోవైపు చిరు కూడా రియాక్ట్ అవ్వకపోవడం.. ఇటు బొత్స మౌనం పాటించడంతో పక్కా అని తేలిపోయిందన్న మాట.

ఇదే జరిగితే.. పవన్‌కు ఊహించని షాకే..!
అయితే ఈ వార్త నిజమైతే పవన్ కల్యాణ్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ సొంతింట్లో తగులుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ పార్టీ పెట్టినప్పట్నుంచి ఇంతవరకూ ఇద్దరి రాజకీయంగా కలిసిందీ లేదు.. కనీసం 2019 ఎన్నికల హోరాహోరీలోనూ కనీసం పవన్‌కు మద్దతివ్వండని మెగాభిమానులకు చిరు పిలుపు కూడా ఇవ్వలేదు. ఇలాంటి తరుణంలో చిరును జగన్ రాజ్యసభకు పంపితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక ఊహించుకోనక్కర్లేదు. అంటే ఒకే ఇంట్లో వేర్వేరు కుంపట్లన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే చిరు మీడియా ముందుకు రావాల్సిందే..!

More News

దేవరకొండ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో గోల్డ్ మెడల్ సాధించిన కిక్ బాక్సర్ గణేష్ ఎంబారి

హీరో విజయ్ దేవరకొండ స్థాపించిన ‘‘దేవరకొండ ఫౌండేషన్’’ చేసిన చిన్న ఆర్థిక సహాయం ఓ యువ క్రీడాకారుడి కెరీర్ కు దోహదపడింది.

21న వస్తున్న నయనతార 'వసంతకాలం'

లేడి సూపర్ స్టార్ నయనతార నటించగా ఘన విజయం సాధించిన ఓ సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ను 'వసంత కాలం' పేరుతొ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు

'15-18-24 లవ్ స్టోరీ' ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన మెహ్రీన్ పిర్జాదా

వయసు ప్రభావం ప్రేమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో

హర్ట్ అయిన పవన్.. బీజేపీతో జనసేన కటీఫ్!?

బీజేపీతో కటీఫ్ కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావిస్తున్నారా..? బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నప్పటికీ తనకు ప్రాధన్యత ఇవ్వకపోవడంతో పవన్ హర్టయ్యారా..?

త్యాగరాయ గానసభలో ప్రముఖరచయిత ‘పురాణపండ  శ్రీనివాస్’ కు ఘన సత్కారం

మానసిక వ్యవస్థ విరాజిల్లడానికి అద్భుతమైన గ్రంథాల్ని రచించడంలో, ప్రచురించడంలో సత్యాన్వేషణతో కూడిన క్రొత్త సొగసుల్ని సృష్టించి వేలాదిమందికి ఆకట్టుకుంటున్న ప్రముఖరచయిత పురాణపండ శ్రీనివాస్