మళ్లీ జగన్ మార్క్.. ఆసక్తికరంగా మేయర్, డిప్యూటీ పదవులు
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆసక్తికరంగా మారాయి. ‘నొప్పించక.. తానొవ్వక’ అన్నట్టుగా వైసీపీ అధినేత వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు కనిపిస్తుంది. ఆశావహులు ఎక్కువగా ఉన్నచోట మేయర్ పదవిని ఇద్దరికి చొప్పున అప్పజెప్పారు. ఇక డిప్యూటీ మేయర్ పదవిని అయితే నలుగురికి పంచి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. మచిలీపట్నం మేయర్, డిప్యూటీ మేయర్ విషయానికి వస్తే.. మేయర్ పదవి... మోకా వెంకటేశ్వరమ్మ, చిటికిన వెంకటేశ్వరమ్మకే దక్కనుంది. మొదటి రెండు సంవత్సరాలు మోకా వెంకటేశ్వరమ్మ.. చివరి మూడు సంవత్సరాలు చిటికిన వెంకటేశ్వరమ్మ మేయర్ పదవిని చేపట్టనున్నారు. డిప్యూటీ మేయర్ పదవులు కూడా నలుగురు చేపట్టనున్నారు. ఇద్దరిద్దరి చొప్పున చెరి రెండున్నర యేళ్లు నిర్వహించనున్నారు. తొలి రెండున్నర సంవత్సరాలు డిప్యూటీ మేయర్లుగా లంకా సూరిబాబు, తంటిపూడి కవిత చేయనున్నారు. చివరి రెండున్నర సంవత్సరాలు శీలం భారతి, మాడపాటి వెంకటేశ్వరమ్మ ఉండనున్నారు.
మైదుకూరులో లాస్ట్ వరకూ టెన్షన్..
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎంపిక ప్రక్రియలో చివరి నిమిషంలో ఉత్కంఠ కొనసాగింది. ప్రమాణ స్వీకార ఓటింగ్ కేంద్రానికి గెలిచిన వైసీపీ, టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు చేరుకున్నారు. ప్రమాణ స్వీకార ఓటింగ్‌కు టీడీపీ నుంచి గెలిచిన షేక్ మహబూబి, జనసేన అభ్యర్థి బాబు గైర్హాజరయ్యారు. కాగా వైసీపీ బలం: 11 మంది అభ్యర్థులు + 2 ఎక్స్ అఫిషియో ఓట్లు..
టీడీపీ బలం: 12 కాగా షేక్ మహబూబి హాజరు కాకపోవడంతో టీడీపీ బలం 11 కి చేరుకుంది.
చివరి నిమిషంలో మేయర్ పదవి ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నడుమ సస్పెన్స్ వీడింది. మైదూకూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. చైర్మన్‌గా మాచునూరు చంద్ర, వైస్ చైర్మన్‌గా మహబూబ్ షరీఫ్‌లు ఎన్నికయ్యారు. ఎక్స్అఫిషియా ఓట్ల సాయంతో వైసీపీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను దక్కించుకుంది.
నూతన మేయర్, డిప్యూటీల ప్రమాణ స్వీకారం
ఇక గుంటూరు నగర మేయర్ విషయానికి వస్తే.. మేయర్‌గా కావటి మనోహర్ నాయుడు... డిప్యూటీ మేయర్‌గా డైమండ్ బాబును అధిష్టానం ఎంపిక చేసింది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా... జంగారెడ్డిగూడెం మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ వీడింది. మున్సిపల్ చైర్ పర్సన్‌గా బత్తిన నాగలక్ష్మి ఎంపికయ్యారు. అలాగే ఇదే జిల్లాలోని నిడదవోలు చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తైంది. చైర్మన్‌గా భూపతి ఆదినారాయణను అధిష్టానం ఎంపిక చేసింది. అలాగే విశాఖ జీవీఎంసీ వైసీపీ మేయర్ అభ్యర్థి గొలగాని హరి వెంకట కుమారి.. డిప్యూటీ మేయర్‌గా జీఎం శ్రీధర్‌ని ప్రత్యేక అధికారి ప్రకటించారు. మండపేట మున్సిపాలిటీ నూతన చైర్మన్‌గా పతివాడ నూక దుర్గ రాణి, వైస్ చైర్మన్‌గా పిల్లి గణేశ్వరరావులు ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు, మదనపల్లె మున్సిపల్ చైర్ పర్సన్‌గా వి.మనూజ, వైస్ చైర్మన్‌గా నూర్ అజామ్‌లను ఎన్నకున్నారు. అలాగే చిత్తూరు కార్పొరేషన్ మేయర్‌గా ఎస్.ఆముద, డిప్యూటీ మేయర్‌గా లాయర్ చంద్రశేఖర్‌లను మెజారిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రస్తుతం వీరంతా వారి వారి పరిధిలోని మునిసిపల్ ఆఫీసుల్లో ప్రమాణ స్వీకారం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com