ఎస్పీబీకి భారతరత్న ఇవ్వాలని కోరుతూ మోదీకి జగన్ లేఖ..
Send us your feedback to audioarticles@vaarta.com
గాన గంధర్వుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని సినీ, రాజకీయ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా ఈ ప్రతిపాదనకు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డికు మద్దతుగా నిలిచారు. బాలుకు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ఆయన సోమవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో జగన్ పలు విషయాలను ప్రస్తావించారు. పలు భాషల్లో బాలు పాడిన పాటలు, ఆయన పొందిన పురస్కారాలు వంటి విషయాలను జగన్ లేఖలో ప్రస్తావించారు.
ఎస్పీ బాలు ఎంతో మంది వర్ధమాన గాయకులను ఇండస్ట్రీకి పరిచయం చేశారని.. 50 ఏళ్ల పాటు సంగీత ప్రియులను అలరించారని జగన్ లేఖలో పేర్కొన్నారు. మాతృభాషతో పాటు పలు భాషల్లో 40 వేలకు పైగా గీతాలను ఆలపించారని తెలిపారు. ఆరు జాతీయ ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్‌గా గుర్తింపు పొందారన్నారు. బాలు..25 నంది అవార్డులతో పాటు.. భారత ప్రభుత్వం నుంచి 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ వంటి పురస్కారాలను పొందారని జగన్ లేఖలో వెల్లడించారు.
ఇప్పటికే ప్రముఖ నేపథ్య గాయకులయిన లతా మంగేష్కర్, భుపెన్ హజారిక, ఎమ్మెస్ సుబ్బలక్ష్మీ, బిస్మిల్లా ఖాన్, భీమ్సేన్ జోషిలకు భారతరత్న అవార్డులు భారత ప్రభుత్వం అందజేసిందని జగన్ పేర్కొన్నారు. వారితో పాటు ప్రజానీకాన్ని ఐదు దశాబ్ధాల పాటు గాయకుడిగా అలరించిన బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని లేఖలో జగన్ వివరించారు. మరి జగన్ లేఖపై మోదీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout