‘నా మతం మానవత్వం.. నా కులం మాట నిలబెట్టుకోవడం’ - జగన్
Send us your feedback to audioarticles@vaarta.com
‘నా మతం మానవత్వం.. కులం మాట నిలబెట్టుకోవడమే’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తన కులం, మతంపై ప్రతిపక్షాలు పదేపదే ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు. పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామని.. అలాగే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కాగా.. సోమవారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ‘వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా’ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. రోగులకు ఆర్థికసాయం చెక్కులను తన చేతులమీదుగానే స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. విశ్రాంతి సమయంలో పేషెంట్ కోలుకునే వరకు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నా మతం మానవత్వం.. నా కులం..!
మేనిఫెస్టో అన్నది ఒక భగవత్గీత, ఖురాన్, బైబిల్‌గా పాటిస్తూ..ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నాను. ఈ రోజు రకరకాల ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన జరుగుతుంటే ఇవాళ జీర్ణించుకోలేని పరిస్థితి. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే నా మతం, కులం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటిమాటలు వింటే బాధనిపిస్తోం. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకోవడం. ప్రస్తుతం నాకు సంబంధం లేని అంశాలపై పెద్దదిగా చేసి చూపుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతాను. దేవుడి దయ, ప్రజల దీవెనలు నాకు ఉన్నాయి. మొదటి నుంచీ ప్రజలు, దేవుణ్ణే నమ్మాను. మీరంతా నన్ను దీవించాలి. ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే సంతోషంగా ఉంది’ అని చెబుతూ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout