వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రిలీజైన 'ప్రేమెంత పని చేసే నారాయణ' ఆడియో
Send us your feedback to audioarticles@vaarta.com
జె.ఎస్. ఆర్. మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సపర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ , అక్షిత హీరో హీరోయిన్ గా జొన్నలగడ్డశ్రీనివాస రావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం 'ప్రెమెంత పని చేసె నారాయణ'.
ఈ చిత్ర ఆడియోను ఇటీవల ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అమలాపురంలో పర్యటిస్తున్న వైయస్ జగన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ రోజు రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ...."మా అబ్బాయి హరికృష్ణకు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంతో అభిమానం. వారితో ఈ చిత్రంలోని ఒక్క పాటైనా లాంచ్ చేయాలని పట్టు పట్టడంతో ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అమలాపురంలో పర్యటిస్తోన్న వైయస్ జగన్ గారిని కలిసి మా చిత్ర ఆడియో వారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.
వారు ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ ...మా 'ప్రేమెంత పనిచేసే నారాయణ' చిత్రంలోని పాటలు లాంచ్ చేసి, మా అబ్బాయికి వారి బ్లెస్సింగ్స్ అందించారు. జగన్ గారు రిసీవ్ చేసుకున్న విధానం చాలా సంతోషాన్ని కలిగించింది. ఆదిత్య ఆడియో ద్వారా పాటలు మార్కెట్ లోకి వచ్చాయి.ఇప్పటికే విడుదలైన మా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కు , టైటిల్ సాంగ్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై రెండో వారంలో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.
హీరో హరికృష్ణ జొన్నలగడ్డ మాట్లాడుతూ..."నేను ఎంతో అభిమానించే వైయస్ జగన్ గారు మా చిత్ర ఆడియో లాంచ్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. పాటలకు మంచి స్పందన వస్తోంది. జూలై రెండో వారంలో వస్తోన్న సినిమాకు కూడా మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది. టీమ్ అంతా అందించిన సపోర్ట్ తో సినిమా చాలా బాగా వచ్చిందన్నారు.
నటి ఝాన్సీ మాట్లాడుతూ..."ఈ సినిమా ద్వారా దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావుగారు నాలోని కొత్త కోణాన్ని చూపిస్తున్నారు. ఒక క్రూరమైన పాత్రలో నటించా. ఈ పాత్ర నా కెరీర్ కు ఒక టర్నింగ్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న హరికృష్ణ కి మంచి ఫ్యూచర్ ఉంది. హీరోకు కావాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. ప్రేమకోసం ఎంతకైనా తెగించే పాత్రలో నటించాడు" అన్నారు.
హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ..."ఈ సినిమాలో నా క్యారక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. హరికృష్ణ కిది ఫస్ట్ సినిమా అయినా డాన్స్, ఫైట్స్ చాలా బాగా చేశాడు" అన్నారు.
సంగీత దర్శకుడు యాజమాన్య మాట్లాడుతూ..."పాటలన్నీ సందర్భానుసారంగా ఉంటాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఆర్.ఆర్ కూడా అద్బుతంగా కుదిరింది. జూలై రెండో వారంలో వస్తోన్న సినిమా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు".
ఝాన్సీ , చిలుకూరి గంగారావు, ఎఆర్సి.బాబు, రాహుల్ బొకాడియా , పింగ్ పాంగ్, రాఘవపూడి, రాజారావు తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథఃజేయస్ఆర్ మూవీస్; స్క్రీన్ ప్లేః భూపతిరాజా, మరుధూరిరాజా, రాజేంద్రకుమార్; మాటలుఃసుబ్బరాయుడు బొంపెం; సంగీతంః యాజమాన్య; పాటలుః వనమాలి, గోసాల రాంబాబు; ఎడిటర్ః జానకిరామ్; కెమెరాః పియస్వంశీ ప్రకాష్; కొరియోగ్రఫీః ప్రేమ్ రక్షిత్, విద్వాసాగర్, శ్రీధర్; నిర్మాతః సావిత్రి జొన్నలగడ్డ; దర్శకత్వంః జొన్నలగడ్డ శ్రీనివాసరావు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments