జగన్ రెక్వెస్ట్: మేనమామగా అడుగుతున్నా.. వెయ్యి ఇవ్వండి!

ప్రపంచంతో పోటిపడి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లు బాగుండేలా అక్కచెల్లెమ్మలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. చిత్తూరు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘జగనన్న అమ్మ ఒడి’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ పథకం గురించి నిశితంగా వివరిస్తూ.. లబ్ధిదారులను రెక్వెస్ట్ చేశారు.

మీ పిల్లలు వెళ్తున్న స్కూల్స్‌పై ధ్యాస పెట్టండి!
‘మన ఎన్నికల ప్రణాళికలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇస్తామని చెప్పాం. చెప్పిన దానికన్న మిన్నగా 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఈ పథకాన్ని తీసుకువస్తూ అమలు చేస్తున్నాం. పిల్లల చదువుల కోసం అడుగులు ముందుకు వేస్తూ రెండో అడుగు వేస్తున్నాం. ప్రతి స్కూల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నాం. మీరు స్కూల్‌ పనితీరులో భాగస్వాములు కావాలి. ఆ స్కూల్‌ బాగుండేలా మీరంతా కూడా మమేకం కావాలి. ఇందుకోసమే పేరెంట్‌ కమిటీలు తెచ్చాం. ఇందులో నా విన్నపం. మీ బడుల్లో బాత్‌రూములు ఉంటాయి. స్కూళ్లకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు ఉంటాయి. మీ పిల్లలు వెళ్తున్న బాత్‌రూములపై కాస్త ధ్యాస పెట్టండి. మీ బడుల్లో ఉన్న బాత్‌రూమ్‌ల మెయింట్‌నెస్‌ కోరకు ఒక మనిషిని పెట్టుకుంటే జీతం రూ.4 వేలు, మెయింటెన్స్‌ కోసం మరో రూ.2 వేలు అవుతుంది. వాచ్‌మెన్‌ను పెట్టుకుంటే దానికి మరో రూ.4 వేలు ఖర్చు అవుతుంది. ఈ చిన్న సొమ్ములో మీరంతా భాగస్వాములు అయితే మీరు ప్రశ్నించవచ్చు. మీ స్కూళ్లపై మీకు ఒనర్‌ షిప్‌ కూడా వస్తుంది’ అని జగన్ చెప్పుకొచ్చారు.

మేనమామగా అడుగుతున్నా ఇవ్వండి!
ఈ సందర్భంగా లబ్ధిదారులను జగన్ రెక్వెస్ట్ చేశారు. ‘స్కూళ్లకు ఒక్క వెయ్యి రూపాయిలు సహాయం చేయగలిగితే.. 14 వేలు మీరే పెట్టుకోండి. కేవలం ఒక్క వెయ్యి రూపాయిలు ఇవ్వమని ఆ పిల్లల మేనమామగా అడుగుతున్నాం. నాడు-నేడు ద్వారా అన్ని చేస్తాం. మెయింటెనెన్స్‌లో ప్రజలు భాగస్వాములు కావాలి. ఈ కార్యక్రమం వల్ల పిల్లల జీవితాలు బాగుపడుతాయని పూర్తిగా విశ్వసిస్తూ.. ఇవాళ డబ్బులు జమా చేస్తున్నాం. ఇంకా ఎవరికైనా ఈ పథకం వర్తించకపోతే ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. అందరికి కూడా అవకాశం ఇస్తాం. మరో నెల రోజులు అవకాశం కల్పిస్తాం. ఫిబ్రవరి 9లోపు నమోదు చేసుకుంటే వాళ్లకు కూడా డబ్బులు జమా చేస్తాం. మీ గ్రామాల్లోని గ్రామ సచివాలయాలను ఉపయోగించుకోండి. గ్రామ వాలంటీర్‌ సహాయంతో ఈ పథకంలో పేర్లు నమోదు చేసుకోండి’ అని వైఎస్ జగన్ కార్యక్రమంలో మాట్లాడారు.

More News

మహేశ్ బాబుకు వైఎస్ జగన్ సాయం..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వీరాభిమానులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

'శివ 143' మూవీ సాంగ్ లాంచ్ చేసిన జె.డి.చక్రవర్తి

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్)

'ఎంత మంచివాడ‌వురా'తో నా కోరిక తీరింది - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో

దాడులు చేస్తే ఊరుకోం.. అన్నీ చోట్లా వైసీపీదే గెలుపు!!

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డిపై దాడితో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

మెగాస్టార్ ఊ అంటే నేను రెడీ : అనిల్ రావిపూడి

టాలీవుడ్‌లో వరుస హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. మరీ ముఖ్యంగా విభిన్నమైన కథలను ఎంచుకోవడం..