YS Jagan: కుటుంబాలను చీల్చే కుట్రలు.. షర్మిలపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీ సీఎం జగన్(CM Jagan) తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరి వైయస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో పరోక్షంగా స్పందించారు. కాకినాడలో పింఛన్లు రూ.3వేలకు పెంపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు(ChandraBabu) పాలనలో రూ.1000 ఉండే పింఛన్‌ను గత ఎన్నికలకు ముందు రూ.2వేలకు పెంచారని గుర్తు చేశారు. గతంలో పింఛన్ పొందాలంటే పడిగాపులు కాయడమే కాకుండా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి ఉండేదని ఆరోపించారు. ఇప్పుడు తన ప్రభుత్వంలో సెలవు దినమైనా పండగరోజు అయినా సరే ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. ఇలాంటి మంచి పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు జగన్ ఎందుకు చేయగలిగారో ఆలోచించాలని ప్రజలను కోరారు.
అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)పైనా మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిపరుడని ఆదాయపుపన్ను శాఖ, ఈడీ అధికారులు సమన్లు ఇస్తే, న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జైలులో పెట్టామన్నారు. కానీ జైలుకు వెళ్లి దత్తతండ్రిని పరామర్శించి చాలా మంచోడని సర్టిఫికేట్ ఇస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉండబట్టే దత్తపుత్రుడు నోరు మెదపలేదని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే దత్తపుత్రులు ప్రశ్నించలేదన్నారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్లు కడుతూ ఉంటే సీబీఐ దర్యాప్తు జరపాలని కేంద్రానికి లేఖ రాశారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపించాలని ఈ దత్తపుత్రుడి ప్రయత్నమన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాబోయే రోజుల్లో ఇంటికి కిలో బంగారం, ఇంటికో బెంజ్ కారు ఇస్తామని అబద్ధాలు చెబుతారని విమర్శించారు. అలాగే కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమం కూడా జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆయన సోదరి వైయస్ షర్మిల కాంగ్రెస్‌లోకి చేరనుండడంతో పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా మీ బిడ్డ నమ్ముకున్నది ప్రజలనేనని పేర్కొన్నారు. ఇవన్నీ ఆలోచించి ప్రజలకు మంచి చేసే వారిని ఎన్నుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout