YS Jagan: కుటుంబాలను చీల్చే కుట్రలు.. షర్మిలపై జగన్ పరోక్ష వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Wednesday,January 03 2024]

ఏపీ సీఎం జగన్(CM Jagan) తాజా రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సోదరి వైయస్ షర్మిల(YS Sharmila) కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యంలో పరోక్షంగా స్పందించారు. కాకినాడలో పింఛన్లు రూ.3వేలకు పెంపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు(ChandraBabu) పాలనలో రూ.1000 ఉండే పింఛన్‌ను గత ఎన్నికలకు ముందు రూ.2వేలకు పెంచారని గుర్తు చేశారు. గతంలో పింఛన్‌ పొందాలంటే పడిగాపులు కాయడమే కాకుండా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సి ఉండేదని ఆరోపించారు. ఇప్పుడు తన ప్రభుత్వంలో సెలవు దినమైనా పండగరోజు అయినా సరే ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. ఇలాంటి మంచి పనులు చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు జగన్ ఎందుకు చేయగలిగారో ఆలోచించాలని ప్రజలను కోరారు.

అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పైనా మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవినీతిపరుడని ఆదాయపుపన్ను శాఖ, ఈడీ అధికారులు సమన్లు ఇస్తే, న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు జైలులో పెట్టామన్నారు. కానీ జైలుకు వెళ్లి దత్తతండ్రిని పరామర్శించి చాలా మంచోడని సర్టిఫికేట్ ఇస్తాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామ్యం ఉండబట్టే దత్తపుత్రుడు నోరు మెదపలేదని విమర్శించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే దత్తపుత్రులు ప్రశ్నించలేదన్నారు. కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్లు కడుతూ ఉంటే సీబీఐ దర్యాప్తు జరపాలని కేంద్రానికి లేఖ రాశారని మండిపడ్డారు. ఇళ్ల నిర్మాణాన్ని ఆపించాలని ఈ దత్తపుత్రుడి ప్రయత్నమన్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాబోయే రోజుల్లో ఇంటికి కిలో బంగారం, ఇంటికో బెంజ్ కారు ఇస్తామని అబద్ధాలు చెబుతారని విమర్శించారు. అలాగే కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమం కూడా జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆయన సోదరి వైయస్ షర్మిల కాంగ్రెస్‌లోకి చేరనుండడంతో పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు జరిగినా మీ బిడ్డ నమ్ముకున్నది ప్రజలనేనని పేర్కొన్నారు. ఇవన్నీ ఆలోచించి ప్రజలకు మంచి చేసే వారిని ఎన్నుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.

More News

‘రాఘవ రెడ్డి’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది - హీరో శివ కంఠమనేని

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో

Gautham Adani: హిండెన్‌ బర్గ్‌ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అదానీకి భారీ ఊరట..

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(Adani)కి సుప్రీంకోర్టు(Supreme Court)లో భారీ ఊరట లభించింది. హిండెన్ బర్గ్(Hindenburg) నివేదికపై సెక్యూరిటీస్

Saindhav Trailer: యాక్షన్ సీన్స్‌తో 'సైంధవ్' ట్రైలర్.. సైకోగా అదరగొట్టిన వెంకీ..

విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సైంధవ్'(Saindhav). 'హిట్', 'హిట్ 2' చిత్రాల దర్శకడు శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వం వహించిన ఈ మూవీ

YS Sharmila: సీఎం జగన్‌తో భేటీ కానున్న వైయస్ షర్మిల.. సర్వత్రా ఆసక్తి..

కొన్ని సంవత్సరాలుగా ఉప్పు నిప్పులుగా ఉన్న సీఎం జగన్(CM Jagan), ఆయన సోదరి వైయస్ షర్మిల(YS Sharmila) తాడేపల్లిలో భేటీ కానున్నారు. ప్రస్తుతం కడపలో

సామాజిక సాధికారిత ఆధారంగా వైసీపీ కొత్త ఇంఛార్జ్‌ల ప్రకటన

త్వరలో జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందుకోసం అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపడుతోంది. సామాజిక సాధికారతే ధ్యేయంగా