పవన్‌తో కేసీఆర్, కేటీఆర్ భేటీ.. మధ్యలో జగన్!?
- IndiaGlitz, [Sunday,January 27 2019]
రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇక్కడి వరకూ ఓకేగానీ.. మధ్యలో వైఎస్ జగన్ ఎక్కడ్నుంచి వచ్చారబ్బా..? అసలు ఆయన గవర్నర్ తేనీటి విందుకు రాలేదు కదా..? ఆయనకేం సంబంధమేంటి అనుకుంటున్నారా..? ఈ భేటీలో చర్చ జరిగింది మొత్తం వైఎస్ జగన్ గురించేనట. అసలు ఆ భేటీలో ఏం చర్చకొచ్చాయ్..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఏడాది ఇదే హాట్ టాపిక్!
ప్రతీ ఏడాదీ తేనీటి విందుకై తెలుగు రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీల అధినేతలతో పాటు పలువురు ప్రముఖులు వస్తుంటారు. అయితే ఈసారి మాత్రం ఎట్ హోం కార్యక్రమంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. విందుకు కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ రావడం అరగంట పాటు కార్యక్రామానికి వచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఒకరి తర్వాత మరొకరు భేటీ అవ్వడం చర్చనీయాంశమైంది. మరీ ముఖ్యంగా ఇటీవలే జగన్-కేటీఆర్-కేసీఆర్‌ల త్రయంపై పవన్ విమర్శలు గుప్పించారు కూడా. అయితే ఆ వ్యవహారం అయిపోయిన కొద్దిరోజులకే ఇలా కేసీఆర్, కేటీఆర్‌లు పవన్‌తో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విందు కార్యక్రమం మొత్తంలో పవన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారరని చెప్పుకోవచ్చు. అయితే ఈ వరుస భేటీలో అసలేం జరిగింది..? ఏ విషయంపై చర్చ జరిగిండొచ్చు? అసలు కథేంటి..? అని రాజకీయ విశ్లేషకులు చర్చలు మొదలుపెట్టారు.
భేటీలో చర్చకొచ్చిన విషయాలేంటి..!?
సుమారు అరగంట పాటు అటు కేటీఆర్‌తో.. ఇటు కేసీఆర్‌తో పవన్ చర్చలు జరిగాయి. కేటీఆర్‌తో నవ్వుతూ మాట్లాడిన పవన్.. కేసీఆర్ దగ్గరికొచ్చే సరికి ఏదో విషయంపై మాట్లాడుతున్నట్లు, తల ఊపుతున్నట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల వైఎస్ జగన్-పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకుంటారని.. ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు బరిలోకి దిగారని స్వయానా రాయబారం నడుపుతున్నారని స్వయానా జనసేనానే చెప్పుకొచ్చారు. ఈ విషయంపై కేటీఆర్ పక్కన కూర్చున్నప్పడు నిశితంగా చర్చించారని సమాచారం. మరోవైపు జగన్-కేటీఆర్ భేటీపై కూడా పవన్‌తో కేసీఆర్ చర్చించినట్లుగా తెలుస్తోంది.
ఆఖరి వరకూ ఉండేదెవరు..? ఊడేదెవరు!
ఓ వైపు జనసేన-వైసీపీని కలపితే జగన్‌కు తిరుగుండదని కేసీఆర్.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని పవన్.. మరోవైపు జగన్-పవన్ కలవకూడదని అవసరమైతే తనతో కలుపుకుని పోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఒకప్పుడు జగన్, పవన్, కేసీఆర్ ముగ్గురూ మోదీకి తొత్తులుగా మారారన్న చంద్రబాబు.. ఈ మధ్య పవన్‌ను పక్కనెట్టేసి కేసీఆర్, జగన్‌ను మాత్రమే పట్టించుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అంటే చంద్రబాబు మనసులో ఏముందన్నది చాలా ఈజీగానే అర్థం చేస్కోవచ్చు. అయితే ఈ 2019 రణరంగంలో ఎవరు ఏ గూటికి వెళ్తారు..? ఫైనల్‌గా పోటీలో ఉండెదెవరు..? ఊడేదెవరు..? అసలు పవన్ కల్యాణ్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అనే విషయాలు తెలియాలంటే మరో నెలపాటు వేచి చూడాల్సిందే మరి.