ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం..: ‘జయహో’లో జగన్

  • IndiaGlitz, [Monday,August 12 2019]

‘ప్రజాసంకల్పయాత్ర’ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మకంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్రకు సంబంధించిన అన్ని వివరాలు భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశ్యంతో ‘జయహో’ అనే పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి రచించారు. కాగా 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను.. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. సోమవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం!

ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్‌. 3648 కి.మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. ప్రజల సహకారంతోనే నేను విజయవంతంగా 14 నెలల పాటు పాదయాత్ర పూర్తి చేశాను. ప్రజలతో కలిసి సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశాను. పాదయాత్ర ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తాను అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన పాదయాత్రపై పుస్తకాన్ని రచించిన పెద్దలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

More News

సూపర్‌గుడ్‌ ఆర్‌.బి.చౌదరి తనయుడు రమేష్‌ మెయిన్‌ విలన్‌గా 'నిరీక్షణ'

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఆర్‌.బి.చౌదరి పలు భాషల్లో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.

పూరీ-విజయ్ సినిమా ఫిక్స్.. ప్రకటన వచ్చేసింది!

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా హిట్టవ్వడంతో సూపర్ డూపర్ హిట్టవ్వడంతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మళ్లీ క్రీజులోకి వచ్చారు.

‘రణరంగం’ లో నా పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది! - కళ్యాణి ప్రియదర్శన్

శర్వానంద్, కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటీనటులుగా సుధీర్ వర్మ తెరకెక్కిన చిత్రం ‘రణరంగం’.

'నీ కోసం' ట్రైలర్ లాంచ్

వైవిధ్యమైన సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న చిత్రం ‘నీకోసం’.

`జెర్సీ` రీమేక్‌లో అమలాపాల్

ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన తెలుగు చిత్రం `జెర్సీ` మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.