తొలి కేబినెట్‌లోనే సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు

  • IndiaGlitz, [Monday,June 10 2019]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోగా.. కేబినెట్ వాటిని ఆమోదించింది.

ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే..

సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపు
ఆశా వర్కర్ల జీతాలు 3000 నుంచి 10,000కు పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ చెల్లింపునకు ఆమోదం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత అంతేకాకుండా వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం
వైఎస్సార్‌ రైతు భరోసా అమలుపై కేబినెట్‌లో చర్చ

ఇదిలా ఉంటే.. మొత్తం 8 కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డుల వేతనాల పెంపునకు సంబంధించి ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. హోంగార్డుల జీతాల పెంపుపైనా సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపైనే చర్చసాగింది. కాగా కేబినెట్ పూర్తయిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.

More News

ఏపీ సచివాలయంలో కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొలువుతీరిన మంత్రులకు చాంబర్లు(పేషీ) కేటాయించడం జరిగింది.

చంద్రబాబుకు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చిన హోం మంత్రి సుచరిత!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరం పరాజయం పాలైన టీడీపీ ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుండగా..

జయరామ్ హత్య కేసు షాకింగ్ ట్విస్ట్: 23 ఛార్జిషీట్లు.. 12మంది నిందితులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై చిగురుపాటి జయరామ్ హత్యకేసులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

ప్రముఖ దక్షిణాది నటుడు గిరీశ్ కర్నాడ్ కన్నుమూత

ప్రముఖ దక్షిణాది నటుడు, ప్రముఖ సినీ, రంగస్థల నటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) తుదిశ్వాస విడిచారు.

జగన్‌కు మోదీ అంటే భయం.. ఎవ‌రు నిల‌బ‌డ‌తారో.. ఎవ‌రు పారిపోతారో!

ఆంధ్రప్రదేశ్‌ను లీడ్ చేస్తున్న వారికి ప్రధాని మోదీ అంటే భయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా ఎద్దేవా చేశారు.