తొలి కేబినెట్‌లోనే సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలి కేబినెట్ భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన కేబినెట్ సమావేశం ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకూ జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోగా.. కేబినెట్ వాటిని ఆమోదించింది.
ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివే..
సామాజిక పెన్షన్లు రూ.2250కి పెంపు
ఆశా వర్కర్ల జీతాలు 3000 నుంచి 10,000కు పెంపు
ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ చెల్లింపునకు ఆమోదం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ సుముఖత అంతేకాకుండా వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం
వైఎస్సార్ రైతు భరోసా అమలుపై కేబినెట్‌లో చర్చ
ఇదిలా ఉంటే.. మొత్తం 8 కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డుల వేతనాల పెంపునకు సంబంధించి ఏం చేయాలన్నదానిపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. హోంగార్డుల జీతాల పెంపుపైనా సమావేశంలో చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపైనే చర్చసాగింది. కాగా కేబినెట్ పూర్తయిన తర్వాత మంత్రులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout