గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్.. త్వరలోనే వైసీపీలోకి గంటా?
Send us your feedback to audioarticles@vaarta.com
మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నట్టు తెలుస్తోంది. ఆయన వైసీపీలోకి త్వరలోనే జంప్ చేయనున్నట్టు సమాచారం. గతంలోనే ఆయనపై ఇలాంటి రూమర్లు వచ్చినప్పటికీ ఆయన అదేమీ లేదని తీసిపారేశారు. తాజాగా మరొకసారి గంటా పార్టీ మారడంపై చర్చలు జరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా టీడీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తుండటంతో ఈ చర్చలకు బలం చేకూరినట్టైంది. దీనిని ఆయన ఖండిస్తూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే ఇప్పటికే వైసీపీలో చేరికపై గంటాకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది.
సీఎం జగన్‌కు సన్నిహితులతో ఆయన ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపించినట్టు తెలుస్తోంది. అసలు వైసీపీలో చేరిక విషయమై అటు వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డికి గానీ.. ఇటు మంత్రి అవంతి శ్రీనివాస్‌కి గానీ తెలియదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతకాలంగా విజయసాయిరెడ్డికి జగన్ తగిన ప్రాధాన్యమివ్వడం లేదంటూ చర్చ నడుస్తోంది. ఈ సమయంలో గంటా పార్టీలో చేరితే తనకు మరింత ప్రాధాన్యం తగ్గిపోతుందేమోనని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్టు వైసీపీలో చర్చ జరుగుతోంది. మొత్తంగా జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని.. అన్ని అవాంతరాలనూ తొలగించుకుని త్వరలోనే గంటా వైసీపీలో చేరుతారని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com